AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆత్మను చంపేశారు.. వీడియో

ఆత్మను చంపేశారు.. వీడియో

Samatha J
|

Updated on: Aug 08, 2025 | 11:49 AM

Share

టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత.. ఎక్కువ సహజంగా ఉండాల్సిన సన్నివేశాలను కూడా ఏఐ టూల్స్ తో రూపొందించడం నిజంగా అత్యంత దారుణం అని పలువురు వాపోతున్నారు. సినిమాలలో ఏఐ వాడకంపై ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ టెక్నాలజీలు వచ్చిన తర్వాత సహజత్వానికి ప్రాణం లేకుండా చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన క్లైమాక్స్‌తో ‘రాంఝనా’ సినిమాను రీ రిలీజ్‌ చేయడం తనను కలతకు గురిచేసిందని ప్రముఖ సినీ నటుడు ధనుష్‌ అన్నారు. ఇది ఆ సినిమా ఆత్మనే కోల్పోయేలా చేసిందని పేర్కొన్నారు. ఇందుకు తాను అభ్యంతరం తెలిపినప్పటికీ సంబంధిత పార్టీలు ఈ విషయంలో ముందుకెళ్లాయంటూ ‘ఎక్స్‌’లో ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల క్రితం తాను కమిట్‌ అయిన సినిమా ఇది కాదని పేర్కొన్నారు. సినిమాల్లో కంటెంట్‌ను మార్చడానికి ఏఐని ఉపయోగించడం ఇటు కళను, అటు కళాకారులను ఇద్దరినీ ప్రభావితం చేస్తుందని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ పరిణామం కథ చెప్పే విధానానికి, సినిమా వారసత్వానికి ప్రమాదకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పద్ధతులను నివారించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో

కన్నబిడ్డకోసం తండ్రి సాహసం.. చిరుతతో పోరాడి వీడియో

పాతకారులోంచి భయంకర శబ్ధాలు.. సిబ్బంది పరుగో పరుగు వీడియో