Medaram Jatara: మేడారానికి హెలికాప్టర్‌ లో వెళ్లొచ్చు.. టిక్కెట్ రేట్లు.! ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు..

Updated on: Feb 18, 2024 | 7:16 PM

మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ పర్యాటకశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. జాతరకు బస్సుల్లోనే కాదు ఇక నుంచి హెలికాప్టర్‌లోనూ వెళ్లొచ్చు. ఈనెల 21 నుంచి 24 జాతర జరగనుండగా.. హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో వెళ్లేందుకు వీలు కల్పించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా..

మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ పర్యాటకశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. జాతరకు బస్సుల్లోనే కాదు ఇక నుంచి హెలికాప్టర్‌లోనూ వెళ్లొచ్చు. ఈనెల 21 నుంచి 24 జాతర జరగనుండగా.. హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో వెళ్లేందుకు వీలు కల్పించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మలకు మొక్కలు చెల్లించుకునేందుకు లక్షలాదిగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు సరేసరి. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మేడారం భక్తుల కోసం పర్యాటకశాఖ గతంలో హెలికాప్టర్ సేవలు అందించిన సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకుంది. ధరల వివరాల ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారు. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లినవారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్‌రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయచ్చు!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..