Hyderabad Rains: రాత్రంతా దంచికొట్టిన వాన.. రోడ్లన్నీ జలమయం.. లైవ్ వీడియో
గ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రి వర్షం దంచి కొట్టింది. నగరంలో మబ్బులు విరిగిపడ్డాయా? లేదంటే ఉన్న పళంగా వరుణుడు దండెత్తాడా అనే రేంజ్‌లో.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రి వర్షం దంచి కొట్టింది. నగరంలో మబ్బులు విరిగిపడ్డాయా? లేదంటే ఉన్న పళంగా వరుణుడు దండెత్తాడా అనే రేంజ్‌లో.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఓటర్ రింగ్ రోడ్డు పరిధిలో వాన బీభత్సం సృష్టించింది. నగరంలోని అన్ని ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. కూకట్ పల్లి నుంచి మొదలు కొహెడ వరకు.. సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ వరకు.. ఏ ఒక్క ప్రాంతాన్నీ వరుణుడు వదిలిపెట్టలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆరు జోన్లలోనూ భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయిన వాన అర్ధరాత్రి 12 వరకు కురిసింది. దీంతో ముంపు కాలనీలు గజగజా వణికిపోయాయి. అత్యధిక వర్షపాతం 10 సెంటిమీటర్లు దాటగా.. సరాసరి 5 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూగజీవితో చిన్నారి స్నేహం.. అడ్డుగా నిలిచిన ఫెన్సింగ్..
ఏం ధైర్యం.. పులి చెవిని నోటకరచుకొని లాక్కెళ్లిన కుక్క !!
Prakash Raj: రాత్రిళ్లు అలా చేయడం వల్ల.. ప్రకాశ్ రాజ్ భయపడేవాడు !!