Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో

పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో

Samatha J
|

Updated on: Jun 15, 2025 | 3:50 PM

Share

ఆరోగ్యంగా ఉండాలని చాలామంది వాకింగ్ చేస్తారు. అన్ని వయసుల వారు చేయగలిగే సాధారణ, సులువైన వ్యాయామం ఇది. దీనికోసం ఎలాంటి పరికరాలు అక్కర్లేదు. అయితే వాకింగ్ చేసే సమయంలో షూ లేదా చెప్పులు వేసుకొని నడవడం చేస్తారు. కానీ చెప్పులు లేకుండా వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో పచ్చిక గడ్డి మీద నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. దీనినే గ్రౌండింగ్ అంటారు. మరి ఈ గ్రౌండింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చెప్పులు లేకుండా పచ్చిక గడ్డి మీద ఒట్టి పాదాలతో నడవడం వల్ల మనసుకు, శరీరానికి మధ్య కనెక్షన్ పెరుగుతుంది. ముఖ్యంగా భూమి నుండి ఎలక్ట్రాన్లు శరీరానికి బదిలీ అవుతాయి. ఇది నిద్రనాణ్యతను మెరుగుపరుస్తుంది. శరీరంలో సహజంగా ఉండే విద్యుత్ శక్తి బ్యాలెన్స్‌గా ఉండటంలో తోడ్పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మనసు మీద, శరీరం మీద భారం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది మానసిక స్థితిని బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. మనిషి శరీరంలో ఉండే చాలా నరాలు పాదాల దగ్గర ముగుస్తాయి. అంటే శరీరంలో నరాలకు ముగింపు పాదాల భాగం. చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో నడిస్తే పాదాలలో ఉండే నరాల ఫ్లెక్స్ పాయింట్లు యాక్టివ్ అవుతాయి. ఇవి శరీరమంతా మెరుగైన రక్త ప్రసరణ, ఆక్సిజన్ సప్లై, శక్తి ప్రవాహానికి సహాయపడతాయి. ప్రస్తుత కాలంలో ఇంట్లో ఉంటున్న కాలానికి చెప్పులు వేసుకుంటున్నారు చాలామంది.