Ganesh Laddu Auction: సరికొత్త రికార్డ్.. రూ. 1.26 కోట్లు పలికిన గణపతి లడ్డూ..
Ganesh Laddu Auction in Hyderabad: సరికొత్త రికార్డ్.. 1.26 కోట్ల ధర పలికిన గణపతి లడ్డూ. అవును, హైదరాబాద్‌లో గణపతి లడ్డూ ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు సృష్టించింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్‌మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు ధరకు పలికింది. వినాయకుడి లడ్డూ వేలంలో రూ. 1.26 కోట్లు పలికింది.
Ganesh Laddu Auction in Hyderabad: సరికొత్త రికార్డ్.. 1.26 కోట్ల ధర పలికిన గణపతి లడ్డూ. అవును, హైదరాబాద్‌లో గణపతి లడ్డూ ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు సృష్టించింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్‌మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు ధరకు పలికింది. వినాయకుడి లడ్డూ వేలంలో రూ. 1.26 కోట్లు పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. గణపతి లడ్డూ రూ. 1.20 కోట్లు పలికింది. గతేడాది ఇక్కడ గణపతి లడ్డూ రూ. 60.80 లక్షలు పలికింది. అయితే ఈసారి మాత్రం అంతకు రెండింతలు ధర పలకడం గమనార్హం. 2021లో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రూ. 41 లక్షలు పలికింది. గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు. ఇందుకోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడటం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..