నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్న కుర్ర హీరోలు..
2026 ఫిబ్రవరిలో తెలుగు సినీ ప్రేక్షకుల కోసం నవ్వుల పండగ సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత మీడియం రేంజ్ హీరోలు తమ కామెడీ, ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు వస్తున్నారు. శ్రీ విష్ణు "విష్ణు విన్యాసం", విశ్వక్ సేన్ "ఫంకీ" వంటి చిత్రాలతో పాటు నిఖిల్ "స్వయంభు" పీరియడ్ సినిమా కూడా ఫిబ్రవరిలో విడుదలవుతున్నాయి. ఈసారి లాజిక్ పక్కనబెట్టి కామెడీతో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు. ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. సింపుల్‌గా లాజిక్స్ అన్నీ పక్కనబెట్టి.. కామెడీ మ్యాజిక్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈసారి 2026 ఫిబ్రవరిలో నవ్వుల పండగ జరగబోతుంది. మరి ఏంటా సినిమాలు..? ఎవరా హీరోలు..? ప్రతీసారి సంక్రాంతికి ఎమోషనల్, యాక్షన్ సినిమాలు వచ్చేవి.. కానీ ఈసారి మాత్రం పండక్కి అన్నీ ఎంటర్టైనర్స్ వస్తున్నాయి. ప్రభాస్, చిరంజీవి నుంచి రవితేజ, నవీన్ పొలిశెట్టి, శర్వా వరకు అంతా నవ్వులు పూయించే పనిలోనే ఉన్నారు. ఇవే నవ్వులు ఫిబ్రవరిలో పీక్స్‌కు చేరుకోబోతున్నాయి. అందులో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు కూడా జాయిన్ అయ్యారు. సామజవరగమనా, ఓం భీమ్ బుష్, సింగిల్ లాంటి హిలేరియస్ సినిమాలతో శ్రీ విష్ణు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం విష్ణు విన్యాసం అంటూ సొంత పేరుతోనే మ్యాజిక్ చేయడానికి వచ్చేస్తున్నారు ఈ హీరో. ఫిబ్రవరి 2026లో రాబోయే ఈ సినిమాకు యధునాథ్ మారుతిరావు దర్శకుడు. సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. అనుదీప్ కేవీ, విశ్వక్ సేన్ కాంబినేషన్లో వస్తున్న వస్తున్న ఫంకీ ఫిబ్రవరి 13న రానుంది. ముందు ఎప్రిల్ 3 అనుకున్నా.. 50 రోజులు ప్రీ పోన్ చేసారు మేకర్స్. ఇలా జరగడం అరుదే.. కానీ జరిగింది. ఈ ఎంటర్టైనర్స్ మధ్యలో స్వయంభు అనే పీరియడ్ సినిమాతో వస్తున్నారు నిఖిల్. మొత్తానికి మీడియం రేంజ్ హీరోలంతా సంక్రాంతి తర్వాత దండయాత్ర చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2 వారాలు.. 12 సినిమాలు.. దండయాత్రే
బిగ్‌బాస్ టైటిల్ నాదే నాన్నా.. భరణికి లీకిచ్చిన తనూజ..
ఫైనల్ ఓటింగ్.. ఎవ్వరికీ అందకుండా దూసుకుపోతున్న కళ్యాణ్
తండ్రి ఆసుపత్రి బెడ్‌పై.. కొడుకు మరణశయ్యపై.. నటుడి మిస్టరీ డెత్
Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో

