Yash: రెండేళ్లలో నాలుగు రిలీజ్‌లు.. బిగ్ స్కెచ్ రెడీ చేసిన రాకీభాయ్
కేజీఎఫ్ 2 లాంటి బిగ్ హిట్ తరువాత యష్ నుంచి ఇంత వరకు సినిమా రాలేదు. అంత పెద్ద సక్సెస్ తరువాత ఏ సినిమా చేయాలన్న నిర్ణయం తీసుకోవడానికి చాలా టైమ్ తీసుకున్న యష్. దీంతో ఈ స్టార్ హీరో కెరీర్‌లో లాంగ్ బ్రేక్ ఇచ్చింది. అందుకే ఆ బ్రేక్‌ను మరిపించేలా వరుస రిలీజ్‌లు ప్లాన్ చేస్తున్నారు యష్. కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్, గీతూ మోహన్‌దాస్ కెప్టెన్సీలో టాక్సిక్ సినిమాను పట్టాలెక్కించారు.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లుగా వర్క్ చేస్తున్నారు. ఇంత గ్యాప్ రావటంతో నెక్ట్స్ వరుస రిలీజ్‌లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు యష్. టాక్సిక్‌తో పాటు రామాయణ సినిమాలను 2026లోనే రిలీజ్ చేసేందుకు డేట్స్ లాక్ చేశారు. ఆ తరువాత కూడా అదే జోరు కంటిన్యూ చేసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ తమిళ దర్శకుడు మిత్రన్ దర్శకత్వంలో ఓ సైన్స్‌ఫిక్షన్ మూవీకి ఓకే చెప్పారు రాకీభాయ్. రామాయణ 2 కూడా లైన్‌లో ఉంది కాబట్టి, ఆ సినిమాతో పాటు షార్ట్ గ్యాప్‌లోనే పీఎస్ మిత్రన్ సినిమాను కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా రాబోయే రెండేళ్లలో ప్రతీ ఆరు నెలలకు ఓ సినిమా రిలీజ్ అయ్యేలా జాగ్రత్తగా డేట్స్ ప్లాన్ చేస్తున్నారు యష్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ షాక్.. అలా మైనస్ అవ్వడానికి గల కారణం ఏంటి
రూటు మారుస్తున్న సీనియర్ స్టార్స్.. కుర్ర హీరోలకు ఇక పోటీ తప్పదా ??
కుర్ర హీరోలు కనబడుటలేదు.. జాడ కోసం వెతుకుతున్న ఫ్యాన్స్..
తొక్కిసలాట ఘటనపై.. సుప్రీంకోర్టుకు విజయ్ పార్టీ
కాంతార సక్సెస్ ఎఫెక్ట్.. ఏకంగా రూ.12 కోట్లతో.. కోటలాంటి ఇల్లు కట్టుకున్న రిషబ్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

