కాంతార సక్సెస్ ఎఫెక్ట్.. ఏకంగా రూ.12 కోట్లతో.. కోటలాంటి ఇల్లు కట్టుకున్న రిషబ్
ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతోంది. కాంతార చాప్టర్ 1 సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఊహకందని అనిర్వచనీయమైన అనుభూతినిచ్చేలా రిషబ్ శెట్టి చాలా గొప్పగా కాంతార చాప్టర్ 1ను తెరకెక్కించారనీ దర్శకులు సందీప్ వంగా, రామ్‌గోపాల్ వర్మ ప్రశంసించారు.
విదేశీ నిపుణులు తీర్చిదిద్దిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని మెస్‌మరైజ్ చేస్తోంది. అయితే ఇక్కడే రిషబ్ శెట్టి బ్యాక్ గ్రౌండ్ గురించి నెట్టింట వెతుకుతున్నారు. వాస్తవానికి రిషబ్ కు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. చిన్న ఆఫీస్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అదంతా అతని ట్యాలెంట్, కష్టం మాత్రమే. రిషబ్ శెట్టి స్వస్థలం ఉడిపిలోని కుందాపూర్ లో ఉన్న ఆయన విలాసవంతమైన ఇల్లు కూడా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సంస్కృతి, కళ, సినిమా పట్ల ఉన్న ప్రేమను చూపుతూ రిషబ్ శెట్టి తన నివాసాన్ని నిర్మించారు. సుమారు రూ.12 కోట్లు విలువ చేసే ఈ భవనం ఆయన ముత్తాతల నుంచి వచ్చిన స్థలంలోనే కట్టారు. ఇది కేవలం ఇల్లు కాకుండా.. మ్యూజియంను తలపించేలా ఉంటుంది. ఈ ఇంటి భద్రత కోసం ఫేషియల్-రికగ్నిషన్ కెమెరాలు , ‘యక్ష’ అనే కుక్క కాపలాగా ఉంటుంది. ఈ ఇంటి ప్రధాన ద్వారం బ్రాస్ స్టడ్డెడ్ బర్మా టేకు కలపతో తయారైంది. డోర్ బెల్‌కు బదులుగా, చేతితో లాగే ఆలయ గంట టంగ్ మంటూ మోగుతుంది . అంతేకాదు ఇంటి లోపల 300 కేజీల గ్రానైట్‌తో భారీ తులసి కోటను ఏర్పాటు చేశారు. ఇంటి ఈశాన్యంలో ఒక ప్రత్యేకమైన నల్లరాయి ఉంది. ఆ రాయిపై ఎవరైనా ఏడు సెకన్ల పాటు నిలబడితే చాలు.. ఒక్కసారిగా ‘భూత కోల’ సినిమా సన్నివేశంలోని దైవత్వం నిండిన శబ్దాలు మార్మోగుతాయి. ఇది రిషబ్‌కు అత్యంత ఇష్టమైనది.సినిమాకు సంబంధించిన వ్యక్తి కావడంతో, వినోదానికి ఈ ఇంట్లో పెద్ద పీట వేశారు . ఇటాలియన్ లెదర్ రెక్లైనర్లు, 150-అంగుళాల రిట్రాక్టబుల్ స్క్రీన్‌తో కూడిన అత్యాధునిక ప్రైవేట్ థియేటర్ కూడా ఉంది. ఇందులో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ అమర్చారు. మంగళూరు పెంకులతో చేసిన షాండ్లియర్ గదికి ఎరుపు రంగు కాంతిని అందిస్తుంది. ఇక్కడి ప్రొజెక్టర్‌కు రిషబ్ శెట్టి ముద్దుగా కాంతారలోని రక్షక అటవీ దేవత పేరు ‘సేలేరాయ’ అని పెట్టారు. ఇక వంటగది కౌంటర్ నల్లరాతితో మెరిసేలా ఉంటుంది . దీన్ని ఇంట్లో చేసిన కొబ్బరి నూనెతో శుభ్రం చేస్తారు. అంతే కాదు రిషబ్ ఇంట్లో పెద్ద లైబ్రరీ కూడా ఉంది. లాఫ్ట్ ఏరియాలో జానపద కథల నుంచి స్టీఫెన్ కింగ్ నవలల వరకు 1,200కు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఇంటి వైఫై పాస్‌వర్డ్ ప్రతి నెలా మారుతుంది. అది కూడా ‘కాంతార’ సినిమాలోని ఒక కొత్త డైలాగ్‌తో!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గట్టిగా ఇచ్చిపడేసిన బిగ్ బాస్.. దెబ్బకు బిత్తర పోయిన కంటెస్టెంట్స్
కోట్లు ఇచ్చినా.. స్టార్ హీరోలతో కొట్టించుకోను.. సినిమా ఛాన్స్‌పై మల్లారెడ్డి చమత్కారం!
మురుగు నీరు కారణంగా చిక్కుల్లో బిగ్ బాస్ !! షో ఆగిపోయే పరిస్థితి !!
లగ్జరీ కార్ల కోసం అక్రమ మార్గలు.. ED రైడ్స్‌తో చిక్కుల్లో స్టార్స్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

