లగ్జరీ కార్ల కోసం అక్రమ మార్గలు.. ED రైడ్స్‌తో చిక్కుల్లో స్టార్స్
దుల్కర్ , పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇళ్లలో ఈడీ దాడులు మరో సారి ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. మరో సారి వీరినే గురిపెట్టారు. లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసకున్నారన్న కారణంగా.. ఈ మలయాళీ హీరోల ఇళ్లలో మరో సారి సోదాలు నిర్వహించారు.
భూటాన్ నుంచి లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నారని.. దుల్కర్ సల్మాన్ నివాసంలో ఈడీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 17 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. అటు నటుడు పృథ్వీరాజ్ నివాసంలోనూ ఈడీ బృందాల సోదాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌లో మొదటిసారి సోదాలు చేసిన ఈడీ.. ఇప్పుడు మరోసారి దాడులు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లతో పాటు.. కోజికోడ్‌లోని లగ్జరీ కార్ షోరూమ్‌లలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇండియా భూటాన్.. ఇండియా నేపాల్ మార్గాల ద్వారా కొంత మంది సిండికేట్‌గా మారి ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్, మసెరటి వంటి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసి.. రిజిస్ట్రేషన్ చేసి విక్రయిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి ఓ రిపోర్ట్ బయటికి వచ్చింది. కోయంబత్తూరుకు చెందిన ఒక నెట్‌వర్క్ భారత సైన్యం, అమెరికా రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి నకిలీ పత్రాలను, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాలలోని నకిలీ ప్రాంతీయ రవాణా కార్యాలయం రిజిస్ట్రేషన్లను ఉపయోగించిందని సమాచారం. ఈ వాహనాలను సినిమా ప్రముఖులు సహా అధిక ఆస్తులు ఉన్న ప్రముఖ వ్యక్తులకు తక్కువ ధరలకు అమ్మినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమరావతిలో 8 కీలక ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు
అయ్య బాబోయ్.. భారీ కొండ చిలువ..
నడిరోడ్డుపై రౌడీయిజం.. అదే రోడ్డుపై పోలీసుల ట్రీట్ మెంట్
హైవేపై కుప్పకూలిన హెలికాప్టర్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
ఏ భాష మెసేజైనా మీ భాషలో చదువుకోవచ్చు.. వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

