హైవేపై కుప్పకూలిన హెలికాప్టర్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
అమెరికాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో ఉన్న హైవేపై హెలికాప్టర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సాక్రమెంటో ఫైర్ డిపార్ట్‌మెంట్ సహాయక చర్యలు చేపట్టింది. హో ఎవెన్యూలో ఉన్న హైవేపై హెలికాప్టర్ కూలింది. ఎయిర్ మెడికల్ సర్వీసులు కల్పించే హెలికాప్టర్ గా దీనిని గుర్తించారు.
అది ఏరియా ఆస్పత్రి నుంచి ప్రయాణిస్తుందా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియదన్నారు. ఏ కారణం వల్ల కూలిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రుల్లో ట్రీట్ చేస్తున్నారు. హెలికాప్టర్ హైవేపై కూలిపోయిన తర్వాత హైవే 50పై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లో హెలికాప్టర్ గాలిలో నియంత్రణ కోల్పోయి.. తిరుగుతూ హైవే దగ్గర నేలపై కూలిపోవడం కనిపిస్తుంది. ఇలా హెలికాప్టర్ కూలిపోతున్న సమయంలో రోడ్డుమీద అనేక కార్లు, వివిధ రకాల వాహనాలు ప్రయాణిస్తున్నట్లు కనిపించాయి. నివేదికల ప్రకారం పిల్లల ఆసుపత్రి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఒక ఫోటో క్రాష్ తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను చూపిస్తుంది. చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలు ఆ ఫోటోలో కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏ భాష మెసేజైనా మీ భాషలో చదువుకోవచ్చు.. వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్
కొడుకు అలిగాడని అప్పు చేసి బైక్ కొనిస్తే.. రెండు రోజులకే యాక్సిడెంట్‌లో మృతి
ఆ కారుకు తరచుగా రిపేర్లు.. యజమానికి రూ.కోటి ఇవ్వాలన్న కన్జ్యూమర్ కోర్టు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

