కోట్లు ఇచ్చినా.. స్టార్ హీరోలతో కొట్టించుకోను.. సినిమా ఛాన్స్‌పై మల్లారెడ్డి చమత్కారం!
'పాలమ్మినా.. పూలమ్మినా' అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయారు BRS నేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాజకీయవేత్తగా ఆయన చెప్పే మాటలు, డైలాగులకు, ప్రసంగాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే పాలిటిక్స్ లో ఉన్నా చాలా సార్లు తనలోని కళామతల్లిని కూడా బయట పెడుతుంటారు మల్లారెడ్డి.
పండగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, కాలేజీ ఈవెంట్లు, ఇలాంటి సందర్భాల్లో.. చిన్న పిల్లాడిలా డ్యాన్స్ లు చేస్తుంటారు. చమత్కారంగా మాట్లాడుతుంటారు. తన మాటలతో నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇప్పుడు, తనకు 3 కోట్ల సినిమా ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశానంటూ చెప్పి నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇప్పుడంటే పెద్దగా కనిపించడం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలు సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లకు హాజరయ్యారు మల్లా రెడ్డి. సినిమాలు, నటీనటులు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా దసరా పండగను పురస్కరించుకుని ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర విసయాన్ని పంచుకున్నారు. తనకు ఓ తెలుగు సినిమా లో విలన్ గా నటించే ఆఫర్ వచ్చిందని, భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తామన్నారని మల్లా రెడ్డి చెప్పుకొచ్చారు. టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తన సినిమాలో తనకు విలన్ పాత్రను ఆఫర్ చేశారంటూ చెప్పారు. అంతేకాదు ఆ రోల్ కోసం తన కాలేజీకి వచ్చి ఒక గంటసేపు వెయిట్ చేశారని.. రూ.3 కోట్ల పారితోషికం కూడా ఆఫర్ చేశాడని చెప్పుకొచ్చారు. అయినా కూడా తాను ఆ విలన్ పాత్రను ఒప్పుకోలేదని.. చెప్పుకొచ్చారు. విలన్‌గా చేస్తే ఇంటర్వెల్ దాకా తాను హీరోను కొడతా.. కానీ ఆ తర్వాత హీరో తనను కొడతాడు.. తిడతాడు అంటూ తన దైన శైళిలో మల్లారెడ్డి చమత్కరించారు. అందుకే సినిమాను రిజెక్ట్ చేసినట్టు చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మురుగు నీరు కారణంగా చిక్కుల్లో బిగ్ బాస్ !! షో ఆగిపోయే పరిస్థితి !!
లగ్జరీ కార్ల కోసం అక్రమ మార్గలు.. ED రైడ్స్‌తో చిక్కుల్లో స్టార్స్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

