సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ

Edited By:

Updated on: Dec 28, 2025 | 6:45 PM

సౌత్ సినిమా మార్కెట్ అద్భుతమైన వృద్ధి సాధించింది. ఒకప్పుడు చిన్నచూపు చూసిన బాలీవుడ్ స్టార్లు, ఇప్పుడు ఇక్కడ సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. సల్మాన్, అమీర్, షారుక్, అక్షయ్ వంటి ప్రముఖులు ఇప్పటికే సౌత్ చిత్రాలలో సందడి చేశారు. ఇది మారిన భారతీయ సినిమా పర్యావరణానికి, సౌత్ మార్కెట్ ప్రాముఖ్యతకు నిదర్శనం.

సౌత్ మార్కెట్ ఏ రేంజ్ హాట్ కేక్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం బాలీవుడ్ సినిమాలతోనే దాన్ని సాధించలేం అని బాలీవుడ్ హీరోలకు అర్థమైపోయినట్లుంది. అందుకే తమ స్థాయి తగ్గించుకుని.. ఓ మెట్టు దిగి మరీ సౌత్ సినిమాల్లో గెస్ట్‌లుగా మారిపోతున్నారు. ఖాన్స్ త్రయమే కాదు.. మిగిలిన హిందీ హీరోలకు ఈ తిప్పలు తప్పట్లేదు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు సౌత్‌ను కనీసం ఓ ఇండస్ట్రీలా కూడా చూసేవాళ్లు కాదు.. మేం తోపులం.. మేమే తోపులం అనే రేంజ్‌లో ఫీలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడంత సీన్ లేదు.. నార్త్ కంటే సౌత్ మార్కెట్ పెరిగింది. అందుకే ఆ హీరోలు కూడా మెట్టు దిగుతున్నారు. దాని ఫలితమే దక్షిణాది సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ అతిథి పాత్రలు. అసలు అమీర్, షారుక్, సల్మాన్ లాంటి సూపర్ స్టార్స్ సౌత్ సినిమాల్లో గెస్టులుగా నటిస్తారని ఎప్పుడైనా అనుకున్నారా..? కనీసం కల గన్నారా..? కానీ కాలం మహిమ.. అదే జరుగుతుందిప్పుడు. ఇప్పటికే రెండేళ్ల కింద గాడ్‌ఫాదర్ సినిమాలో చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు సల్మాన్. అలాగే కన్నప్పలో అక్షయ్ కుమార్, కూలీలో అమీర్ ఖాన్ కాసేపలా సందడి చేసారు. ఇప్పుడు షారుక్ ఖాన్ వంతు. రజినీకాంత్ జైలర్‌ 2లో షారుక్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు రజినీ అంటే ప్రాణం.. అందుకే చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో లుంగీ డాన్స్ అంటూ ట్రిబ్యూట్ కూడా ఇచ్చారు కింగ్ ఖాన్. ఇప్పుడు జైలర్‌ 2లో కింగ్ ఖాన్‌నే రంగం లోకి దిగారు. ఇది తెలిసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అమితాబ్ సైతం కల్కిలో కీలక పాత్రలో నటించారు. మొత్తానికి బాలీవుడ్ స్టార్స్ దిగొస్తున్నారిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు