Lokesh Kanagaraj: సినిమా సెకండాఫ్‌ బాలేదంటే.. ఫోన్‌ పెట్టేశాడు.! విజయ్‌ తండ్రి విమర్శలు ఆ డైరెక్టర్ ని ఉద్దేశించేనా?

Lokesh Kanagaraj: సినిమా సెకండాఫ్‌ బాలేదంటే.. ఫోన్‌ పెట్టేశాడు.! విజయ్‌ తండ్రి విమర్శలు ఆ డైరెక్టర్ ని ఉద్దేశించేనా?

Anil kumar poka

|

Updated on: Jan 29, 2024 | 1:16 PM

తమిళ చిత్ర దర్శకుడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్‌ తండ్రి ఎస్‌.చంద్రశేఖర్‌. సినిమా బాలేదని చెబితే అతడు ఫోన్‌ కట్‌ చేశాడన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ‘‘విజయ్‌ దగ్గరకు వచ్చే కథలను అతడి తండ్రిగా కాకుండా ఒక అభిమానిగా వింటాననీ వాటిలో ఎలాంటి సందేహాలున్నా అడిగి నివృత్తి చేసుకుంటాననీ చంద్రశేఖర్‌ చెప్పారు. ప్రస్తుతం స్క్రీన్‌ప్లేకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వడం లేదనీ తమ సినిమాలో ఒక స్టార్‌ హీరో ఉంటే చాలు..

తమిళ చిత్ర దర్శకుడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్‌ తండ్రి ఎస్‌.చంద్రశేఖర్‌. సినిమా బాలేదని చెబితే అతడు ఫోన్‌ కట్‌ చేశాడన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ‘‘విజయ్‌ దగ్గరకు వచ్చే కథలను అతడి తండ్రిగా కాకుండా ఒక అభిమానిగా వింటాననీ వాటిలో ఎలాంటి సందేహాలున్నా అడిగి నివృత్తి చేసుకుంటాననీ చంద్రశేఖర్‌ చెప్పారు. ప్రస్తుతం స్క్రీన్‌ప్లేకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వడం లేదనీ తమ సినిమాలో ఒక స్టార్‌ హీరో ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదనుకుంటున్నారనీ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. హీరో వల్లే సినిమా హిట్‌ అయినా.. తాను ఏదో గొప్ప అన్నట్లు దర్శకుడు భావిస్తున్నాడనీ కథ బాగుంటే అది భారీ విజయం అందుకుంటుందనేది తన అభిప్రాయమని అన్నారు. మరో ఐదు రోజుల్లో రిలీజ్‌ అనగా.. తాను ఓ సినిమా చూశాననీ వెంటనే దర్శకుడికి ఫోన్‌ చేసి.. ప్రథమార్ధం చాలా బాగుంది..సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ముఖ్యంగా తండ్రి తన సొంత కొడుకునే చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటివి వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పానని అన్నారు.

తన మాటలకు అతడు.. ‘సర్‌, భోజనం చేస్తున్నా. మళ్లీ కాల్‌ చేస్తా’ అని ఫోన్‌ పెట్టేశాడనీ ఆ తర్వాత కాల్‌ చేయలేదనీ చెప్పారు. సినిమా విడుదలయ్యాక చాలామంది తన లానే అభిప్రాయపడ్డారనీ ఒకవేళ అతడు తన మాట విని మార్పులు చేసి ఉంటే మరొక విధంగా ఉండేదని అన్నారు. తన విమర్శలను స్వీకరించేంత ధైర్యం, పరిణతి అతడికి లేవు’’ అని వ్యాఖ్యానించారు. చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆయన మాట్లాడుతున్నది ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ను ఉద్దేశించేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఎక్స్‌ వేదికగా పోస్టులు పెడుతున్నారు. విజయ్‌ , లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘లియో’. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఇది మిశ్రమ టాక్‌కే పరిమితమైంది. విజయ్‌ నటన బాగున్నప్పటికీ కథలో లోపాలున్నాయని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos