LEO Collections: లియో సంచలనం.. 4 రోజుల్లోనే 100 కోట్లు.! కలిసొచ్చిన దసరా సెలవులు
ఇళయ తళపతి విజయ్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌతిండియన్ స్టార్ అర్జున్ సర్జా, అందాల భామ త్రిషా కృష్ణన్ నటించిన లియో చిత్రం బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా కలెక్షన్ల పంట పండిస్తోంది.
ఇళయ తళపతి విజయ్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌతిండియన్ స్టార్ అర్జున్ సర్జా, అందాల భామ త్రిషా కృష్ణన్ నటించిన లియో చిత్రం బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా కలెక్షన్ల పంట పండిస్తోంది. భారీ బడ్జెట్ తో లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లోనే 32 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా.. ఒక్క తమిళనాడులోనే 4 రోజుల్లో 100 కోట్లకిపైగా వసూళ్లను రాబట్టింది. మాస్టర్ సినిమా నుంచి విజయ్ కి ఇక్కడ మార్కెట్ పెరిగింది. వారసుడు సినిమా ఇక్కడ ఆయనకి మరింత హెల్ప్ అయింది. ఇక మాస్టర్, విక్రమ్ సినిమాలతో బాగా పాప్యులర్ అయిన లోకేశ్ కనగరాజ్ కి కూడా తమిళనాట మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఆయన సినిమాలపై అంచనాలు పెరిగాయి. దాంతో సహజంగానే థియేటర్ల దగ్గర సందడి కనిపిస్తోంది. దసరా సెలవులు కూడా ఈ సినిమా వసూళ్లు పెరగడానికి మరో కారణమని చెప్పుకోవచ్చు. అంతేకాదు, దసరా సందర్భంగా మరో భారీ సినిమా ఏదీ లేకపోవడం కూడా లియోకి కలిసొచ్చిందంటున్నారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..