రూ.190 కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్..

రూ.190 కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్..

Phani CH

|

Updated on: Jun 02, 2023 | 9:46 AM

బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ముంబైలో కొత్త మకాం వేసింది. నటి గత కొన్ని నెలలుగా ముంబైలో తన కోసం కొత్త ఇంటి కోసం వెతుకుతోంది. ఇప్పుడు ఆమె అన్వేషణ ముగిసింది. జుహులోని ప్రముఖ సినీ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే ఉన్న విలాసవంతమైన బంగ్లాను ఊర్వశి కొనుగోలు చేసింది.

బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ముంబైలో కొత్త మకాం వేసింది. నటి గత కొన్ని నెలలుగా ముంబైలో తన కోసం కొత్త ఇంటి కోసం వెతుకుతోంది. ఇప్పుడు ఆమె అన్వేషణ ముగిసింది. జుహులోని ప్రముఖ సినీ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే ఉన్న విలాసవంతమైన బంగ్లాను ఊర్వశి కొనుగోలు చేసింది. దాని విలువ అక్షరాల 190 కోట్ల రూపాయలు. యశ్ చోప్రా మరణం తరువాత, అతని భార్య పమేలా చోప్రా ఇక్కడ నివసించేవారు. ఆమె ఏప్రిల్ 20న మరణించింది. ముంబై నడిబొడ్డున ఉన్న ఈ అద్భుతమైన భవనం ఊర్వశికి బాగా నచ్చిందట. ఈ విలాసవంతమైన ఇల్లు నాలుగు అంతస్తులలో ఉంది. ఇంటీరియర్ డెకరేషన్‌తో పాటు అందమైన గార్డెన్, వ్యక్తిగత జిమ్‌ వరకు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయట. గతంలో లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని సెలెస్టే బంగ్లాలో ఊర్వశి ఉండాలనుకుంది. అందుకు తగ్గట్టుగానే అన్ని వసతులతో సిద్ధం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆమె ఇందులోకి మారలేదు. తాజాగా జుహులోని బంగ్లాకు షిఫ్ట్ అయ్యింది. ఊర్వశి రౌటేలా ఇటీవలే కేన్స్ 2023 రెడ్ కార్పెట్‌పై కనిపించింది. ఇక్కడ నటి తన మనోహరమైన రూపాలతో ప్రజలను మెప్పించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో నిఖిల్.. పోస్టర్ అదుర్స్..

విక్రమార్కుడు సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న.. హీరో ఎవరో తెలుసా ??

ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’లో కమలహాసన్ ?? రూ.150 కోట్ల ఆఫర్ లో నిజమెంత ??