TOP9 ET: ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్.. దద్దరిల్లిపోవడం పక్కా.!
పారిస్‌లో జరుగుతున్న 2024 ఒలింపిక్స్ ఒపెనింగ్ సెర్మనీలో మెగా స్టార్ చిరు తన ఫ్యామిలితో కలిసి పాల్గొన్నారు. తన వైఫ్ సురేఖ.. అబ్బాయి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. కోడలు ఉపాసన తో కలిసి ఈవెంట్ ముందు పారిస్ నగర వీధుల్లో హంగామా చేశారు. ఈఫిల్ టవర్ ముందు.. సెన్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ దగ్గర ఉపాసన- చెర్రీ కాసేపు అలా కూర్చోగా.. చిరు సురేఖ పారిస్ నగర వీధులను చుట్టేస్తూ కనిపించారు.
01.chiru: ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.
పారిస్‌లో జరుగుతున్న 2024 ఒలింపిక్స్ ఒపెనింగ్ సెర్మనీలో మెగా స్టార్ చిరు తన ఫ్యామిలితో కలిసి పాల్గొన్నారు. తన వైఫ్ సురేఖ.. అబ్బాయి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. కోడలు ఉపాసన తో కలిసి ఈవెంట్ ముందు పారిస్ నగర వీధుల్లో హంగామా చేశారు. ఈఫిల్ టవర్ ముందు.. సెన్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ దగ్గర ఉపాసన- చెర్రీ కాసేపు అలా కూర్చోగా… చిరు సురేఖ పారిస్ నగర వీధులను చుట్టేస్తూ కనిపించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలను.. ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి కాస్తా బయటికి వచ్చాయి. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
02.chiru: వావ్! ఒలంపిక్స్ టార్చ్‌తో మెగాస్టార్ చిరు.
రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో యామా యాక్టివ్‌గా ఉంటున్న చిరు.. తాజాగా తన ఎక్స్ హ్యాండిల్లో ఓ ఫోటోను పెట్టారు. తన భార్య సురేఖ సమేతంగా.. చేతిలో ఒలింపిక్స్ రెప్లికాను పట్టుకుని ఆ ఫోటోలో కనిపించారు. ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన ఇండియన్ టీంలోని ప్రతీ క్రీడాకారుడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. గో ఇండియా.. జై హింద్ అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు. అయితే ఈ ఫోటోలో కౌ బాయ్ హ్యాట్ పెట్టుకుని వెరీ డాషింగ్‌గా .. ఎనర్జటిక్‌గా చిరు కనిపించడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
03.balayya: మోక్షు సినిమా పై బిగ్ లీక్.. స్టోరీ దద్దరిల్లిపోవడం పక్కా..!
బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది. హనుమాన్ సినిమాతో
నయా పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయిన ప్రశాంత్ నీల్.. బాలయ్య అబ్బాయి మోక్షు కోసం దిమ్మతిరిగే రేంజ్లో ఓ స్టోరీ రెడీ చేసినట్టు ఓ టాక్ బయటికి వచ్చింది. ఆ స్టోరీ మైథలాజికల్ జానర్లోనే సాగనున్నట్టు ఓ న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాతో బాలయ్య అబ్బాయి ఏ రేంజ్లో మ్యాజిక్ చేస్తారో చూడాలి.
04. liger: లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.
ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయంతో.. లైగర్ సినిమా అప్పుల నుంచి ఎట్టకేలకు గట్టెక్కారు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా.. పాన్ ఇండియా రేంజ్లో 2022లో లైగర్ సినిమాను ఈయన రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో.. నష్టాలు రావడంతో.. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ రోడ్డెక్కారు. నష్టాన్ని కాస్తైనా భరించాలంటూ పూరీని ఆఫీస్ ముందు గొడవకు దిగారు. అయితే ఈ వివాదం ఫిల్మ ఛాంబర్ ముందుకు పోవడంతో.. తాజాగా ఛాంబర్ పూరీకి మద్దతుగా నిలిచింది. నైఙాం ఏరియాలో ఎవ్వరికీ రూపాయి ఇవ్వనవసరం లేదంటూ PuriConnectsకు క్లారిటీగా లెటర్ ఇచ్చేసింది.
05.pawan kalyna: మాటిచ్చిన పవన్ కళ్యాణ్.. ఖుషీగా OG ప్రొడ్యూసర్
ఇచ్చిన మాట మీద కట్టుబడే వ్యక్తిత్వం ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా ఓజీ ప్రొడ్యూసర్ డీవీవీ ధానయ్యకు కూడా మాటిచ్చారట. ఎట్టి పరిస్థితుల్లోనైనా.. ఓజీ సినిమాను కచ్చితంగా పూర్తి చేస్తానని.. హామీ ఇచ్చారట. అంతేకాదు షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకోమని కూడా చెప్పారట. అయితే ఎలా బయటికి వచ్చిందనేది పక్కకు పెడితే.. ఓజీ ప్రొడ్యూసర్‌కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో రీసౌండ్ చేస్తోంది. ఓజీ సినిమా తొందర్లో వస్తుందనే నమ్మకం పవన్ ఫ్యాన్స్‌లో కలిగిస్తోంది.
06.vishal reaction : నన్ను ఎవరాపుతారో చూస్తా.. విశాల్ స్ట్రాంగ్ రియాక్షన్.
తన పై తమిళ నిర్మాతల మండలి ఆక్షంలు విధించడంపై.. తాజాగా ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యాడు విశాల్. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ఎవరెన్ని చేసినా… తగ్గేదేలే అంటూ చెన్నారు. తన మీద ఎన్ని ఆరోపణలు చేసినా… దాడులకు దిగినా సినిమాలు తీస్తూనే ఉంటానన్నారు కాస్త ఘాటుగా రియాక్టయ్యారు.
07.hareesh shankar: సీనియర్ రిపోర్టర్ ట్వీట్ పై హరీష్ శంకర్ సీరియస్
తన సినిమాకు సంబంధించి.. అది రూమర్ అయినా.. అన్ అఫిషయల్ న్యూస్ అయినా.. జీరో టోలరెన్స్ అన్నట్టుగా రియాక్టవుతున్నారు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. తాజాగా ఓ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు తన సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పై ట్వీట్ చేసినందుకు కూడా సీరియస్ అయ్యారు. ఇది పద్దతి కాదంటూ ట్వీట్ చేశారు. transaction ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఇద్దరితో confirm చేసుకోవాలని ఆ సీనియర్ జర్నలిస్టుకు సూచించారు. తన ట్వీట్స్‌తో మరో సారి సోషల్ మీడియాలో గోల పెట్టేస్తున్నారు ఈ స్టార్ డైరెక్టర్.
08. mister: మిస్టర్ బచ్చన్ కోసం KGF ఎడిటర్?
ఓ సినిమాపై బజ్‌ను పెంచాలంటే.. దిమ్మతిరిగే రేంజ్లో ఆ సినిమా టీజర్ను కట్ చేయాలి. ఇక తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇదే అనుకున్నారో ఏమో కానీ.. తన అప్ కమింగ్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ టీజర్ కోసం.. ఏకంగా కేజీఎఫ్ టెక్నీషియన్ ఉజ్వల్‌ను రంగంలోకి దించారట. తనతోనే మిస్టర్ బచ్చన్ టీజర్‌ను కట్ చేయించారట. అంతేకాదు ఫైనల్ టీజర్ కాపీని చూసి సూపర్ సాటిఫై అయ్యారట ఈ స్టార్ డైరెక్టర్. ఇక రవితేజాస్ మోస్ట్ అవేటెడ్ మిస్టర్ బచ్చన్ టీజర్ జులై 28న రిలీజ్ కానుంది.
09. ajith: బ్యాడ్ న్యూస్.! అందరూ పప్పులో కాలేశారు
అజిత్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని.. అది కూడా కేజీఎఫ్ ఫ్రాచైజీలో భాగమని ఓ న్యూస్ బయటికి వచ్చింది. అజిత్ ఫ్యాన్స్తో పాటు ఫిల్మ్ లవర్స్కు కిక్కించ్చింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర. వారిద్దరు కలిసిన మాట నిజమే అన్న సురేష్, ఆ మీటింగ్‌లో సినిమాలకు సంబంధించిన డిస్కషన్ జరగలేదన్నారు. ప్రస్తుతం విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో నటిస్తున్నారు అజిత్. దీంతో ఈ విషయాన్ని బ్యాడ్ న్యూస్ అంటూ.. కొంత మంది నెటిజెన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. అందరూ పప్పులో కాలేశారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.