TOP 9 ET: కిస్సిక్ అదిరింది..! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్‌

Updated on: Nov 24, 2024 | 5:04 PM

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. శ్రీలీల ఇందులో చిందేస్తున్నారు. బన్నీ, శ్రీలీల డాన్స్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఫుల్ సాంగ్ నవంబర్ 24 సాయంత్రం 7.02 గంటలకు విడుదల కానుంది.

01. Pushpa 2: కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. శ్రీలీల ఇందులో చిందేస్తున్నారు. బన్నీ, శ్రీలీల డాన్స్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఫుల్ సాంగ్ నవంబర్ 24 సాయంత్రం 7.02 గంటలకు విడుదల కానుంది. 02.Game changer: ఏకంగా అమెరికాలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌! చెర్రీ నయా రికార్డ్‌.. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10 విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అమెరికాలో నిర్వహించనున్నారు. తొలి సారిగా ఓ ఇండియన్‌ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందంటున్నారు మేకర్స్. 03. pushpa2: పుష్ప2 ట్రైలర్ ఎవర్‌గ్రీన్‌ రికార్డు 150 మిలియన్లకు పైగా వ్యూస్‌, మూడు మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన ట్రైలర్‌గా పుష్ప రికార్డు క్రియేట్‌ చేసింది. యూట్యూబ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. ట్రైలర్‌ విడుదలైన 15 గంటలలోపు 40 మిలియన్ల వ్యూస్‌ తెచ్చుకున్న తొలి సౌత్‌ ఇండియా మూవీ కూడా ఇదే కావడం విశేషం. పుష్ప ట్రైలర్‌లో విజువల్స్, యాక్షన్‌, డైలాగ్స్ ప్రతిదీ ఆకట్టుకుంటోంది. 04.actress seetha: నటి ఇంట్లో చోరీ.. దొంగలు బరితెగించారు. దోచుకోవడంలో ఆరితేరుతున్నారు. కష్టపడి సంపాదించుకన్న సంపాదనను లూటీ చేస్తున్నారు....