TOP9 ET: మహేష్, రాజమౌళి సినిమా టైటిల్ లీక్‌ | RC16 బిగ్ అప్డేట్.. ఇక రంగంలోకి రామ్‌ చరణ్‌

Updated on: Feb 16, 2024 | 8:45 PM

జక్కన్న డైరెక్షన్లో మహేష్ హీరోగా ఓ క్రేజీ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ పొడక్షన్ వర్క్ ఫేజ్‌లో ఉన్న ఈసినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది. జక్కన్న ఈ మూవీ టైటిల్‌ను 'మహారాజ్‌' అని ఫిక్స్‌ చేసినట్టుగా ఓ టాక్ అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు ఇండస్ట్రీలోనూ వినిపిస్తోంది. | బుచ్చి బాబు డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.

01. mahesh: మహేష్, రాజమౌళి సినిమా టైటిల్ లీక్‌.

జక్కన్న డైరెక్షన్లో మహేష్ హీరోగా ఓ క్రేజీ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ పొడక్షన్ వర్క్ ఫేజ్‌లో ఉన్న ఈసినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది. జక్కన్న ఈ మూవీ టైటిల్‌ను ‘మహారాజ్‌’ అని ఫిక్స్‌ చేసినట్టుగా ఓ టాక్ అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు ఇండస్ట్రీలోనూ వినిపిస్తోంది.

02.ram charan: RC16 బిగ్ అప్డేట్ ఇక రంగంలోకి రామ్‌ చరణ్‌.

బుచ్చి బాబు డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. RC16 వర్కింగ్ టైటిల్‌తో.. స్పోర్ట్స్‌ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మే నుంచి మొదలుకానుందనే న్యూస్ ఫిల్మ్ సిటీ నుంచి బయటికి వచ్చింది. ఇక ఇందుకోసం జూబ్లీహిల్స్‌లో ఓ భూత్‌ బంగ్లా సెట్‌ను కూడా రెడీ చేశారట మేకర్స్. ఈ బంగ్లాలోనే చెర్రీ మీద మొదటి షెడ్యూల్ మొదలు కానుందని న్యూస్.

03. anushka: శీలవతిగా అనుష్క?

ఇప్పటికే పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమాతో.. పీకల్లోతు బిజీలో ఉన్న డైరెక్టర్‌ క్రిష్‌.. ఆ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి మరో సినిమాను మొదలెట్టేస్తన్నాడు. అనుష్క హీరోయిన్‌గా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. ఇక ఆ సినిమా టైటిలే.. శీలవతి అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తోంది.

04. nagma: ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తుపట్టడం కష్టమేగా.. 🙄

నగ్మ పేరు వినగానే… అప్పట్లో ఆమె క్యూట్ అండ్ హాట్ లుక్స్‌ గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు మాత్రం నగ్మ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. కాస్త చబ్బీగా కూడా తరయ్యారు. ఇక ముంబయ్‌లో సోలోగా లైఫ్ లీడ్ చేస్తున్న ఈమె.. తాజాగా కెమెరా కంటికి చిక్కారు. తన వెటరన్‌ లుక్స్‌తో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ కూడా అవుతున్నారు. దాంతోపాటే గుర్తు పట్టకుండా మారిపోయిందిగా అనే కామెంట్‌ను.. తన ఫ్యాన్స్ నుంచే వచ్చేలా చేసుకుంటున్నారు.

05.vishwak: ఈ మధ్యే రామ్‌ చరణ్‌కు కలిశాను.. కానీ ఎందుకో అడగొద్దు.

కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడే విశ్వక్‌ సేన్.. మరో సీక్రెట్ రివీల్ చేశారు. చాలా సినిమా ఆఫర్స్‌ వస్తున్నాయన్న ఈ స్టార్ హీరో… రీసెంట్‌గా రామ్‌ చరణ్‌ను కూడా కలిశా అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎందుకు కలిశాను.. ఏం మాట్లాడాను అనేది మాత్రం ఇప్పుడు చెప్పనంటూ మాట దాటేశాడు. అందర్నీ సస్పెన్స్‌ లో పడేశాడు.

06. sp charan: ‘కీడాకోల’ లో బాలు AI వాయిస్ సీరియస్ అయిన కొడుకు.

కీడాకోలా మేకర్స్‌పై ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ సీరియస్ అయ్యాడు. కీడా కోలా సినిమాలో.. తన అనుమతి లేకుండా తన తండ్రి బాలు గొంతును AI టెక్నాలిజీతో ఎలా రీ క్రియేట్ చేస్తారంటూ ప్రశ్నించారు. మేకర్స్…. సారీతో పాటు… నష్టపరిహారం కూడా చెల్లించాలని వారికి కోర్టు నోటీసులు పంపించాడు.

07.radhika: టాలీవుడ్ హీరోల పరువు తీసిన ‘రక్త చరిత్ర’ హీరోయిన్.

రక్త చరిత్ర సినిమాతో ఓవర్ నైట్ టాలీవుడ్ లో పాపులర్‌ అయిన రాధికా ఆప్టే.. మరో సారి టాలీవుడ్ సెలబ్రిటీల తీరుపై దారుణ కామెంట్స్ చేశారు. టాలీవుడ్‌లో మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుందని… హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని అన్నారు. అందుకే టాలీవుడ్‌ నుంచి తప్పుకున్నా అంటూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఈమె.

08. Rajadhani files: జగన్‌ సర్కార్‌కు పంచ్‌.. ‘రాజధాని ఫైల్స్‌’కు కోర్ట్ గ్రీన్ సిగ్నల్.

ఏపీలో తీవ్ర వివాదాస్పదంగా మారిన ఫిల్మ్ రాజధాని ఫైల్స్ సినిమాకు ఏపీ హైకోర్ట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో సీఎం జగన్‌ పరువు, ప్రతిష్ఠకు భంగం కలిగించే సీన్స్ ఉన్నాయని వైసీపీ నేతలు కోర్టు మెట్లెక్కడంతో.. ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకుంది ఏపీ కోర్టు. అయితే తాజాగా ఈ మూవీ ధ్రువ పత్రాలను పరిశీలించిన కోర్టు.. మూవీ స్క్రీనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

09.pawan: వావ్! OG సెట్లో.. అదిరిపోయే లుక్‌లో పవన్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా… సుజీత్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ. ఇటీవల పవన్‌ బర్త్‌ డే సందర్బంగా రిలీజ్‌ అయిన పవర్ ఫుల్ గ్లింప్స్‌తో ఎక్కడో వెళ్లిన ఓజీ.. నుంచి ఇప్పుడు ఓ ఫోటో బయటికి వచ్చింది. ఆ ఫోటోలో పవర్ స్టార్ పవన్‌ కళ్యాన్‌ అదిరిపోయే లుక్‌ లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. పవన్‌ ఫ్యాన్స్‌ డీపీగా మారుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..