TOP9 ET: జాలి దయలేని అసురుడు..దిమ్మతిరిగేలా చేసిన బాలయ్య | తండ్రికి అఖీరా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్

హిందూ పూర్‌లో ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం తర్వాత.. బాలయ్య వైపే చూస్తున్న ఫ్యాన్స్కు.. తన బర్త్‌ డే సందర్భంగా దిమ్మతిరిగే సర్‌ప్రైజ్ ఇచ్చేశారు బాలయ్య. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో.. బాబీ డైరెక్షన్లో తాను చేస్తున్న ఎన్టీకే 109 సినిమా నుంచి బర్త్‌ డే స్పెషల్ గ్లింప్స్ను వదిలారు. ఇప్పుడీ టీజర్లోని బాలయ్య ఎలివేషన్ షాట్స్.. ఆయన లుక్‌.. అండ్ డైలాగ్స్ బాలయ్యతో పాటు.. అందరికీ విపరీతంగా కిక్‌ ఇస్తోంది. సోషల్ మీడియాలోనూ.. యూట్యూబ్‌లోని ట్రెండ్ అవుతోంది.

TOP9 ET: జాలి దయలేని అసురుడు..దిమ్మతిరిగేలా చేసిన బాలయ్య | తండ్రికి అఖీరా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్

|

Updated on: Jun 11, 2024 | 9:43 AM

01.balayya 109: జాలి దయలేని అసురుడు.. దిమ్మతిరిగేలా చేసిన బాలయ్య.

హిందూ పూర్‌లో ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం తర్వాత.. బాలయ్య వైపే చూస్తున్న ఫ్యాన్స్కు.. తన బర్త్‌ డే సందర్భంగా దిమ్మతిరిగే సర్‌ప్రైజ్ ఇచ్చేశారు బాలయ్య. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో.. బాబీ డైరెక్షన్లో తాను చేస్తున్న ఎన్టీకే 109 సినిమా నుంచి బర్త్‌ డే స్పెషల్ గ్లింప్స్ను వదిలారు. ఇప్పుడీ టీజర్లోని బాలయ్య ఎలివేషన్ షాట్స్.. ఆయన లుక్‌.. అండ్ డైలాగ్స్ బాలయ్యతో పాటు.. అందరికీ విపరీతంగా కిక్‌ ఇస్తోంది. సోషల్ మీడియాలోనూ.. యూట్యూబ్‌లోని ట్రెండ్ అవుతోంది.

02.akira: తండ్రికి అఖీరా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్..

ఏపీ ఎన్నికల్లో హిస్టారికల్ విక్టరీని అందుకున్న వేళ తన తండ్రి పవన్‌కి , అఖీరా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని మీకు తెలుసా? ఎస్! ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్న మాంటేజ్ షాట్స్ తీసుకుని, మధ్య మధ్యలో డైలాగ్స్‌తో.. అద్భుతంగా ఎడిట్ చేసిన అకీరా తన తండ్రికి ఈ వీడియోను డెడికేట్‌ చేయాలని అనుకున్నారట. ఎలక్షన్స్‌ కి ఆరు నెలల ముందు నుంచి చాలా కష్టపడి మరీ ఈ వీడియో మీదే ఫోకస్ట్ గా పని చేశాడట. అయితే ఇదే వీడియోను రెండు రోజుల క్రితం ఈ వీడియోను షేర్ చేసిన అఖీరా తల్లి రేణు దేశాయ్‌.. ఈ వీడియో ఎడిటింగ్ వెనుక అఖీర ఎంత కష్టం ఉందని.. తన తండ్రిని సర్‌ప్రైజ్‌ చేయడానికి అఖీరా చాలా తిప్పలు పడ్డారని చెప్పారు. అంతే ఇప్పటికీ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంది.

03.pawan: పవన్‌ కళ్యాణ్‌కు హోం శాఖ.? గబ్బర్‌ సింగ్‌ బ్యాక్‌!

మరో రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇక ఈక్రమంలోనే పవన్‌కు చంద్రబాబు ఏ పోర్ట్ ఫోలియో ఇస్తారో తెలుసుకోవాలనే ఆత్రం అందరిలో ఉంది. ఇక ఆ ఆత్రాన్నే పక్కకు పెడితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోం మిస్టర్ అయితే చూడాలనే కోరిక ఈ ఫ్యాన్స్‌లో బలంగా ఉంది. గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో ఖాకీ చొక్కాలో అందర్నీ ఉతికి ఆరేసిన పవన్‌… ఆ పోలీస్‌ బాస్‌గా ఉంటే.. ఏపీ రాష్ట్రం నేరరహిత రాష్ట్రమవుతుందనే కామెంట్ వారి నుంచి వస్తోంది. ఈ కామెంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

04.vijay: అమెరికాలో అభిమానుల రచ్చ.. దేవరకొండను చూసేందుకు పోటీ!

విజయ్ దేవరకొండకు ఇండియాలోనే కాదు.. అమెరికాలో కూడా కొండంత ఫ్యాన్ బేస్‌ ఉంది. తాజాగా మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ అమెరికాలో సందడి చేశారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. విజయ్‌ను చూసిన అక్కడి అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఎక్కడికెళ్లినా విజయ్ క్రేజ్ వేరే లెవెల్ కామెంట్స్ చేస్తున్నారు.

05.poonam: జగన్‌కు సలహా ఇచ్చిన పూనమ్.! సజెషన్ మామూలుగా లేదుగా..!

తన ట్వీట్‌తో ఎప్పుడూ అంతటా హాట్ టాపిక్‌గా మారే పూనమ్ కపూర్ .. ఈ సారి జగన్‌కే సలహా ఇస్తూ ట్వీట్ చేశారు. అంతకుముందు ఎన్నికల్లో జగన్ విజయానికి ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలది కీలకపాత్రని అని.. వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పారని… ఇప్పుడు వారంతా కలిసిపోవాలని కోరుకుంటున్నా అని పూనమ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. దీనిపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలంగా ప్రజల్లోకి రావాలని కోరుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

06.amala: నిండు గర్భంతో.. క్రేజీగా డ్యాన్స్‌

ట్రోలే అవనీయండి..! వైరలే కానీయండి! తనపై విమర్శలు రానియ్యనియ్యండి.. లేద అందరూ అప్రిషియేట్ చేయనియ్యండి! ఇవన్నీ ఏం పట్టించుకోని అమలా పాల్.. తనకు నచ్చనట్టు తాను ఇన్‌స్టాలో ఎంజాయ్ చేస్తున్నారు. నిండు గర్భంతో ఉన్నా కూడా.. జాలీగా డ్యాన్స్‌ చేస్తూ.. రీల్స్ చేస్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు. దాంతో పాటే.. ఇలా చేయడం మంచిదని.. కాదనే డిస్కషన్‌తో నెట్టింట చిన్న డిస్కషన్‌కు కారణం అవుతున్నారు.

07.soudarya: ఆ వ్యక్తికి గాఢంగా ప్రేమించింది.. కానీ చివరికి.!

ప్రేమ అనేది ఒక అద్భత ఫీలింగ్ .. అది మనసుకు నచ్చిన వాళ్ల మీద కలగడం కామన్.. అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య విషయంలో కూడా.. చాలా దృడంగా కలిగిందని చెప్పారు క్యారెక్టర్ యాక్టరస్ నిర్మల. రీసెంట్‌ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. జయం మనదేరా టైంలో.. సౌందర్య తనతో ఓ విషయాన్ని షేర్ చేసుకుందని చెప్పింది. ఆ టైంలో సౌందర్య తన మేన మామను గాఢంగా ప్రేమించేదని.. తనతో పిల్లలను కని, ప్రేమగా చూసుకోవాలని కూడా చెబుతూ ఉండేదని చెప్పింది. కానీ అలా జరగకుండానే.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ ఎమోషనల్ అయింది. తన మాటలతో ఇప్పుడు సౌందర్యను నెట్టింట ట్రెండ్ అయ్యేలా .. తన ఫ్యాన్స్‌ను బాధపడేలా చేసింది.

08.adah: ఆ రెండు సినిమాల కారణంగా.. అరుదైన వ్యాధి బారినపడిన హీరోయిన్

హీరోయిన్లను చూస్తే.. వాళ్లు లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నారనే అందరూ అనుకుంటారు. కానీ వారు ఓ సినిమా కోసం పడే కష్టం ఎంత అనేది ఎవరూ ఆలోచించరు. ఓ సినిమా చేసే మేకోవర్ వల్ల.. వాళ్లు ఎలాంటి అనారోగ్య సమస్యల్లో ఇరుక్కుంటారనేది ఎవరూ ఊహించరు.! కానీ ఊహిస్తే షాకవకుండా ఎవరూ ఉండరు. ! ఇక్కడ ట్యాలెంటెడ్ హీరోయిన్ అదా శర్మ తను చేసిన ది కేరళ స్టోరీస్‌, బస్తర్‌ సినిమాల కారణంగా సమస్యల్లో ఇరుకున్నట్టు చెప్పారు. ఈ సినిమాల కోసం బరువు తగ్గడం.. పెరగడంతో.. తనకు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి వచ్చిదంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ వ్యాధి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాని.. పీరియడ్స్ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూ ఉంటాయంది. దాదాపు 48 రోజుల పాటు బ్లీడింగ్ అవుతుందని.. తన బాధని వ్యక్తం చేసింది.

09.karthik: ఎలుకల దెబ్బకి.. ఏడ్చిన స్టార్ హీరో.. కోట్ల రూపాయల లగ్జరీ కారు షెడ్డుకే!

బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు ఎలుకల వల్ల పెద్ద కష్టమే వచ్చిపడింది. ఇక అసలు విషయం ఏంటంటే..! భూల్ బులయ్యా 2 హిట్ కావడంతో.. ఈ స్టార్ హీరోకు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ 4 కోట్ల విలువైన మెక్ లారెన్ కారును.. ఇచ్చారట. అయితే ఇటీవల ఈ కార్‌లోని మ్యాట్‌ను ఎలుకలు నాశనం చేశాయట. దీంతో ఈ హీరో కార్ షెడ్డుకెళ్లిందట. అంతే కాదు.. ఈ కార్‌లోని మ్యాట్ ను రీ ప్లేస్‌ చేసేందుకు లక్షల్లో ఖర్చు అయిందట. ఇక ఇదే విషయాన్ని రీసెంట్‌ ఈ స్టార్ హీరో ఓ మీడియా మీట్లో చెప్పారు. చెబుతూ చెబుతూనే ఎలుకలు చేసిన పనికి చాలా బాధపడ్డాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles