AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌ను గెలికిన పూల చొక్కా.. ఇక ఎందాకో ఈ రచ్చ..

టాలీవుడ్‌ను గెలికిన పూల చొక్కా.. ఇక ఎందాకో ఈ రచ్చ..

Phani CH
|

Updated on: Jul 24, 2025 | 8:06 PM

Share

తెలుగు సినిమాను రివ్యూ మాఫియా శాసిస్తోందా..అంటే అవుననే సమాధానం వస్తోంది కొందరు నిర్మాతల నుంచి. అంతేకాదు మంచి రేటింగ్ ఇవ్వాలంటే డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లేటెస్ట్‌గా‘వర్జిన్ బాయ్స్ నిర్మాత..రివ్యూలిచ్చే యూట్యూబర్ పూలచొక్కా నవీన్‌పై కేసు పెట్టాడు. పాజిటివ్ రివ్యూ ఇచ్చేందుకు నవీన్ తనను డబ్బులు డిమాండ్ డబ్బులు చేశాడంటూ నిర్మాత కేసు ఫైల్ చేశాడు.

దీంతో రివ్యూవర్స్ వర్సెస్ మేకర్స్ అన్నట్టుగా టర్న్‌ తీసుకుంది ఈ ఇష్యూ..! వర్జిన్ బాయ్స్ సినిమా ప్రమోషన్ కోసం నవీన్‌తో చిత్ర యూనిట్ ఓ డీల్ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం సినిమా రిలీజ్‌కు ముందు సినిమాను తన యూట్యూబ్ చానల్ ద్వారా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రమోషన్ సమయంలో నవీన్ మొదట మంచి రివ్యూలు ఇచ్చినప్పటికీ, తర్వాత చిత్రానికి నష్టం కలిగించేలా నెగెటివ్ రివ్యూలు ఇచ్చాడన్నది ప్రొడ్యూసర్ వెర్షన్. పూలచొక్కా రివ్యూలు తన సినిమాపై ప్రభావం చూపిందని, ఇది తమ మధ్య ఒప్పందానికి పూర్తి విరుద్ధమంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు నిర్మాత రాజా దరపునేని . దీంతో ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నవీన్‌ను విచారణకు పిలిచారు. సినిమా విడుదలకు ముందు,.తర్వాత పాజిటివ్ రివ్యూలు ఇవ్వడానికి కొందరు యూట్యూబర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న టాక్ సినీ ఇండస్ట్రీలో ఉంది. ఒకవేళ నిర్మాతలు డబ్బులు చెల్లించకపోతే, నెగెటివ్ రివ్యూలతో వసూళ్లపై ప్రభావం చూపేలా నెగిటివ్ ప్రచారం చేసి సినిమాను దెబ్బకొడతారని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్జిన్ బాయ్స్ జూలై 11న రిలీజ్ అయింది. ఈసినిమాకు పూలచొక్కా నవీన్ నెగిటివ్ రివ్యూ ఇవ్వడమే కాదు , హీరోయిన్లపై బాడీ షేమింగ్‌ కూడా చేశాడంటోంది చిత్ర బృందం. అయితే తాను జెన్యూన్ రివ్యూనే ఇచ్చానని..తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలుంటే చూపాలంటున్నాడు నవీన్. సినిమా విషయంలోనే మాట్లాడాను తప్ప..హీరోయిన్స్‌ను కించపరిచేలా మాట్లాడలేదన్నది నవీన్ వెర్షన్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇప్పుడంటే జ్యోతిష్యాలు కానీ.. అప్పట్లో మనోడి కథ వేరేలెవల్!

భర్తతో స్టార్ హీరోయిన్ కటీఫ్? ఇన్‌స్టాతో బట్టబయలు

జాన్వీ బిగ్ స్కెచ్‌.. చరణ్‌ సినిమాతో టార్గెట్ అఛీవ్డ్‌

తొమ్మిదేళ్ల కలను నిజం చేసుకునేందుకు.. పెళ్లి వాయిదా వేసుకున్న స్టార్ హీరో

‘మానసికంగా కుంగిపోయా’ రష్మీ షాకింగ్ ట్వీట్ !