TOP 9 ET News: ఈ హిట్టు NKRకే రాసుండవచ్చు..అందుకే NTR వదిలేశాడేమో!|నేనేంటో పుష్ప2లో చూస్తారు..

Top 9 Entertainment News: సుధీర్‌బాబు, కృతి షెట్టి జంటగా నటించిన సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌ మార్క్ స్టూడియో నిర్మించాయి.

Anil kumar poka

|

Aug 10, 2022 | 8:41 PM

1. Aa Ammayi gurinchi
సుధీర్‌బాబు, కృతి షెట్టి జంటగా నటించిన సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌ మార్క్ స్టూడియో నిర్మించాయి. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 16న విడుదల చేయనున్నారు. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

2. Sarvanand
శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీ కార్తిక్‌ తెరకెక్కించిన చిత్రం ఒకే ఒక జీవితం. అమల అక్కినేని ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. తెలుగు, తమిళ్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తల్లీ కొడుకుల అనుబంధాన్ని వ్యక్తం చేసే సైన్స్ ఫిక్షన్‌ సినిమా అని మేకర్స్ చెప్పారు.

3. Nithin
పారితోషికాల విషయంలో అందరి మాటే తన మాట అని అన్నారు హీరో నితిన్‌. ఒక నెలలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరికి, సినిమాల చిత్రీకరణ మొదలవుతుందని అన్నారు. ఆయన నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు నితిన్‌.

4. Kaithi
సూపర్‌ హిట్‌ చిత్రం ఖైదీకి సీక్వెల్‌ కచ్చితంగా ఉంటుందని కన్‌ఫర్మ్ చేశారు కార్తి. ప్రస్తుతం డైరక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ విజయ్‌ సినిమా పనులతో బిజీగా ఉన్నారని, అది పూర్తయిన తర్వాత ఖైదీ మొదలవుతుందని చెప్పారు. ఖైదీ పూర్తయిన తర్వాత విక్రమ్‌ సినిమా సీక్వెల్‌ సెట్స్ మీదకు వెళ్లనుంది.

5. Ananya
లైగర్‌ సినిమా ప్రచారాల్లో బిజీగా ఉన్న అనన్య పాండే తాజాగా మరో సినిమాకు సంతకం చేశారు. ఆయుష్మాన్ ఖురానా, నౌషరత్‌ బారుచా నటించిన డ్రీమ్‌ గర్ల్ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. ఈ సీక్వెల్‌ లో నటించడానికి అనన్య పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఆయుష్మాన్‌తో అనన్య నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇదే.

6. Kangana
ఓ వైపు డెంగ్యూతో ఇబ్బంది పడుతున్నా సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు కంగన. ఆమె నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఎమర్జన్సీ సినిమా పనులు ఆగకూడదని స్పాట్‌కి చేరుకున్నారు. అంత జ్వరంతోనూ పనిచేస్తున్న మీరు స్ఫూర్తిదాయకం అంటూ టీమ్‌ ప్రశంసించింది. జబ్బు నా శీరీరానికే గానీ, ఆశయానికి కాదుగా అంటూ రిప్లై ఇచ్చారు కంగన.

7. Rashmika
పీరియాడిక్‌ సినిమాల్లో నటించాలని ఉందని అన్నారు రష్మిక. తన కంఫర్ట్ జోన్ దాటి సినిమాలు చేయాలని ఉందని తెలిపారు. సినిమాలోని కథను నడిపే అఫ్రీన్‌ పాత్ర, సీతారామమ్‌ కేరక్టర్‌ తనకి ఎప్పుడూ స్పెషలేనని చెప్పారు. బయోపిక్కుల్లోనూ, స్పోర్ట్స్ డ్రామాల్లోనూ నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనని అన్నారు.

8. Pushpa
పుష్ప ఫస్ట్ పార్ట్ లో తన కేరక్టర్‌ ని పెట్టాలని ముందు అనుకోలేదని అన్నారు ఫాహద్‌ ఫాజిల్‌. ప్రేక్షకులకు తన పాత్ర గురించి హింట్‌ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సుకుమార్‌ యాడ్‌ చేశారని చెప్పారు. అసలైన రోల్‌ని సెకండ్‌ పార్ట్ లో చూస్తారని తెలిపారు. పుష్ప సీక్వెల్‌ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు ఫాహద్‌.

9.
వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కిన బింబిసార స్టోరీ లైన్‌ను … కళ్యాణ్ రామ్‌ కంటే ముందు చాలా మంది హీరోలకు వినిపించారట ఈ యంగ్ డైరెక్టర్. అయితే ఆ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారనే న్యూస్ ఇప్పుడందర్నీ షాక్ చేస్తోంది. వశిష్ఠగా పేరు మార్చుకోకముందు.. వేణూగా.. అందరికి సుపరిచితమట ఈయన. అదే పేరుతో వినాయక్ దగ్గర ఏడీగా కూడా వర్క చేశారట. అయితే ఆ టైంలోనే బింబిసార లైన్‌ను రాసుకున్న ఈ యంగ్‌ మ్యాన్… యంగ్ టైగర్ ఎన్టీఆర్కు వినిపించారట. కాని ఎన్టీఆర్ అప్పుడు ఫుల్ బిజీగా ఉండడంతో… స్టోరీ డెవలప్ చేశాక వచ్చి కలవమన్నారట.. కాని ఆ తరువాత ఈ స్టోరీ కళ్యాణ్‌ రామ్‌కు దగ్గరికి చేరి ఇలా సూపర్ డూపర్ హిట్‌ ఫిల్మ్ గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu