100 మంది చిన్నారులకు బిర్యానీ వండి వడ్డించిన టాలీవుడ్ హీరోయిన్..

Updated on: Mar 04, 2025 | 3:25 PM

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో సహాయ నటిగానూ యాక్ట్ చేసింది. అదే సమయంలో తనతో కలిసి నటించిన హీరోతో ప్రేమలో పడింది. పెద్దల ఆశీర్వాదంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది.

గతంలోలాగా ఎక్కువగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. అలా తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియో అందరి మన్ననలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో బిజీగా ఉండే వితిక తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె స్వయంగా వంకాయ బిర్యానీ వండింది. ఆ తర్వాత తనే వంద మంది చిన్నారులకు తన గుత్తి వంకాయ బిర్యానీ వడ్డించింది. అంతేకాదు పిల్లలకు బహుమతులు కూడా అందించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ వితికా షేరును తెగ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. క్లారిటీ…

Chhaava: ఒక్క రోజే 25 కోట్లు.. మొత్తంగా దిమ్మతిరిగే లెక్క! ‘ఛావా’ సంచలనం!

ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రభాస్ అలా కనిపించనున్నాడా?

పవిత్ర స్నానం చేస్తుంటే.. ఇలా వీడియోలు తీయడం ఏంటి?

ఎట్టకేలకు నోరు విప్పిన వంగా.. ఆన్సర్ దొరికేసింది!