Tollywood: ఈ ఫోటోలోని బుడ్డోడు ఇప్పుడు.. టాలీవుడ్‌ టేలెంటెడ్ సూపర్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా..?(వీడియో)

Tollywood: ఈ ఫోటోలోని బుడ్డోడు ఇప్పుడు.. టాలీవుడ్‌ టేలెంటెడ్ సూపర్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా..?(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 24, 2022 | 8:16 AM

Tollywood: సెలబ్రిటీల చిన్నపాటి ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక ట్రెండ్‌లా మారాయి. వాటిని ఫ్యాన్స్ నెట్టింట తెగ సర్కులేట్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కుర్ర హీరో ఫోటో వైరల్ అవుతుంది.


Celebrity throwback photo: హీరో, హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట ట్రెండింగ్ అవుతాయి. ఇప్పడు ఇంకా ఇంటర్నెట్ ట్రెండ్ పెరిగింది కాబట్టి..  ఫ్యాన్ పేజస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు.  ఇంటర్నెట్ అప్‌గ్రేడ్ అవ్వడంతో ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించిన  లేటెస్ట్ అప్‌డేట్స్.. వారి లైఫ్‌లోని అన్ని విషయాలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా.. తమ అభిమానులతో స్పెషల్ లైవ్ చిట్‏చాట్స్ నిర్వహిస్తూ.. వారికి మరింత దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే వారి చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో టాలీవుడ్ కుర్ర హీరో చిన్ననాటి ఫోటో తెగ ట్రెండ్ అవుతోంది. ముందు చిన్న, చిన్న పాత్రలు వేస్తూ ప్రేక్షకులకు పరిచయమైన ఈ కుర్రాడు.. క్రమక్రమంగా తన కెరీర్ ను మలుచుకున్నాడు.  ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి హీరో‏గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు.  ఎవరో గుర్తుపట్టరా ?.. లేదా అయితే ఇక లేటెందుకు ఇక మేమే చెప్పేస్తాం. ఈ ఫోటోలో ఉంది నిఖిల్. సంబరం సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. 2007లో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రంతో ఒక మంచి పాత్రలో మెరిశాడు. కార్తికేయ, స్వామి రా..రా.., అర్జున్ సురవరం, సూర్య వెర్సర్ సూర్య, ఎక్కడికి పోతావ్ చిన్నవాడ, కేశవ, అర్జున్ సురవరం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.  టాలీవుడ్‌లో తక్కువ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన నిఖిల్ ప్రస్తుతం ‘కార్తీకేయ 2’లో నటిస్తున్నారు. ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుంది. ’18 పేజెస్’ అనే మూవీ కూడా నిఖిల్ హీరోగా తెరకెక్కుతుంది. ఇవి కాక మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. కాగా నిఖిల్ భీమవరానికి చెందిన పల్లవి వర్మను వివాహం చేసుకున్నాడు.

మరిన్ని చూడండి ఇక్కడ: