మీడియం రేంజ్ హీరోలు కూడా ఇలా చేస్తే ఎలా..?

Edited By:

Updated on: Dec 19, 2025 | 4:13 PM

స్టార్ హీరోల బాటలో మీడియం రేంజ్ హీరోలు సినిమాల మధ్య భారీ గ్యాప్ తీసుకుంటున్నారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ, అడివి శేష్, సాయి ధరమ్ తేజ్, నవీన్ పొలిశెట్టి, నిఖిల్ వంటి హీరోలు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ విరామం తర్వాత కొత్త సినిమాలతో వస్తున్నారు. వారి రాబోయే చిత్రాలు, విడుదల తేదీలపై పూర్తి వివరాలు ఈ కథనంలో. నాణ్యత కోసమే ఈ నిరీక్షణ అంటున్నారు.

స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఏళ్లకేళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు.. మరి వాళ్లే తీసుకుంటున్నపుడు మేమెందుకు తీసుకోకూడదంటున్నారు మీడియం రేంజ్ హీరోలు. అదేంటంటే.. క్వాలిటీ ముఖ్యం బాసూ అంటున్నారు. మరి ఒక్కో సినిమాకు రెండేళ్లు అంతకంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చిన ఆ హీరోలెవరో చూద్దామా..? మూడేళ్ళ గ్యాప్ అనేది ఏ హీరోకైనా చాలా ఎక్కువ.. మీడియం రేంజ్ హీరోకైతే మరీ ఎక్కువ. అయితే టైమ్ గ్యాప్ ఉన్నా.. టైమింగ్‌లో అస్సలు గ్యాప్ ఉండదంటున్నారు అడివి శేష్. 2022లో హిట్ 2తో వచ్చిన ఈయన.. 2026 మార్చి 19న డెకాయిట్‌తో రానున్నారు. తాజాగా రిలీజ్ డేట్ లాక్ చేసారు మేకర్స్. అలాగే మే 1న గూడఛారి 2 విడుదల కానుంది. అంటే రెండు నెలల్లో 2 సినిమాలన్నమాట. అడివి శేష్ మాత్రమే కాదు.. సాయి ధరమ్ తేజ్ సైతం రెండేళ్లకు పైగానే గ్యాప్ ఇచ్చారు. 2023లో బ్రో సినిమాతో వచ్చిన ఈయన.. సంబరాల ఏటిగట్టు కోసం భారీ గ్యాప్ ఇచ్చారు. 2026 ఫస్టాఫ్‌లో ఈ సినిమా రానుంది. 100 కోట్లకి పైగా బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు సినిమాను తెరకెక్కిస్తున్నారు కొత్త దర్శకుడు రోహిత్. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత నవీన్ పొలిశెట్టి సైతం రెండేళ్ళకు పైగా గ్యాప్ తీసుకున్నారు. జనవరి 14న అనగనగా ఒకరాజు సినిమాతో రానున్నారు. 2023లో స్పై సినిమాతో వచ్చిన నిఖిల్.. భారీ గ్యాప్ తర్వాత స్వయంభు అంటూ 2026 ఫిబ్రవరిలో రానున్నారు. గతేడాది అపుడో ఇపుడో ఎపుడో వచ్చినా.. అది పాత సినిమా. మొత్తానికి క్వాలిటీ కోసం మీడియం రేంజ్ హీరోలు సైతం గ్యాప్ పెంచేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన

ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం

మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ