Vishal Political Entry: రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా..: విశాల్.

Vishal Political Entry: రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా..: విశాల్.

Anil kumar poka

|

Updated on: Apr 24, 2024 | 9:59 AM

ప్రజల అవసరాలను తీర్చే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, తనలాంటి వారు ఎప్పుడూ ఓటర్లుగానే మిగిలిపోతారని సినీ నటుటు విశాల్‌ అన్నారు. రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతో బరిలో దిగుతానని విశాల్‌ ప్రకటించారు. సేలం అమ్మపేటలోని శక్తి కైలాష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ ఆర్ట్స్‌లో విశాల్ రాబోయే చిత్రం రత్నం ప్రమోషన్‌కు సంబంధించి జరిగిన కార్యక్రమంలో నటుడు విశాల్ పాల్గొన్నారు.

ప్రజల అవసరాలను తీర్చే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, తనలాంటి వారు ఎప్పుడూ ఓటర్లుగానే మిగిలిపోతారని సినీ నటుటు విశాల్‌ అన్నారు. రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతో బరిలో దిగుతానని విశాల్‌ ప్రకటించారు. సేలం అమ్మపేటలోని శక్తి కైలాష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ ఆర్ట్స్‌లో విశాల్ రాబోయే చిత్రం రత్నం ప్రమోషన్‌కు సంబంధించి జరిగిన కార్యక్రమంలో నటుడు విశాల్ పాల్గొన్నారు. అనంతరం మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.

పార్టీతో పొత్తు టిక్కెట్ల కేటాయింపు గురించి జనం ఆలోచించవద్దని, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పార్టీని ప్రారంభించాలకున్నట్లు ఆయన తెలిపారు. 2026లో తప్పకుండా రాజకీయ పార్టీ ప్రారంభిస్తానన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వవద్దని, ప్రజలకు పార్టీలు మంచి చేస్తే సినిమాలో నటించి వెళ్లిపోతానని విశాల్ స్పష్టం చేశారు అలాగే, తమిళనాడులో మార్పు రావాలన్నారు. ఈ ఏడాది చివరి నాటికి నటీనటుల సంఘం భవనం పూర్తవుతుందని.. నటీనటుల సంఘ భవనానికి విజయకాంత్ పేరు పెట్టాలని నటీనటుల సంఘంలోని పెద్దలందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!