Lal Salaam Review: హిట్టా.? ఫట్టా.? రజనీకాంత్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసినట్టేనా.?

|

Feb 10, 2024 | 7:40 PM

రజినీ సినిమా అంటే తెలుగు స్టేట్స్‌లోనైనా ఓరేంజ్ లో బజ్ ఉంటుంది. కానీ లాల్‌ సలామ్ విషయంలో ఆ రేంజ్‌ మిస్సైంది. ఎందుకు ఈ సినిమాలో రజీనీ జస్ట్ గెస్ట్‌ రోలే కదా అనా..? లేక సినిమా కాన్సెప్ట్ విషయంలో కన్ఫ్యూజన్‌ ఉండా? ఇక ఇవి పక్కకు పెడితే రీసెంట్‌గా రిలీజ్ అయిన లాల్ సలార్ ఎలా ఉంది? తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..! బాబ్రీ మసీద్ ఘటన తర్వాత 1993లో జరిగే కథ ఇది.

రజినీ సినిమా అంటే తెలుగు స్టేట్స్‌లోనైనా ఓరేంజ్ లో బజ్ ఉంటుంది. కానీ లాల్‌ సలామ్ విషయంలో ఆ రేంజ్‌ మిస్సైంది. ఎందుకు ఈ సినిమాలో రజీనీ జస్ట్ గెస్ట్‌ రోలే కదా అనా..? లేక సినిమా కాన్సెప్ట్ విషయంలో కన్ఫ్యూజన్‌ ఉండా? ఇక ఇవి పక్కకు పెడితే రీసెంట్‌గా రిలీజ్ అయిన లాల్ సలార్ ఎలా ఉంది? తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..!

బాబ్రీ మసీద్ ఘటన తర్వాత 1993లో జరిగే కథ ఇది. కసుమూరు అనే ఊళ్లో హిందువులు, ముస్లింలు ఒక తల్లి పిల్లల్లా ఐకమత్యంగా కలిసుంటారు. వాళ్లకు మొయిద్దీన్ భాయ్ అలియాస్ రజినీకాంత్ అన్ని విధాలుగా అండగా ఉంటాడు. బాయ్ కొడుకు శంషుద్దీన్‌ అలియాస్ విక్రాంత్ క్రికెటర్. ఎప్పటికైనా ఇండియాకు ఆడాలనేది అతిన కల. అయితే ఒక మ్యాచ్ సందర్భంగా గురు అలియాస్ విష్ణు విశాల్ భాయ్ కొడుకు షంషుద్దీన్‌ను కొట్టడంతో రెండు మతాల మధ్య గొడవలు వస్తాయి. అవి కాస్తా హిందూ ముస్లిమ్ గొడవలగా టర్న్‌ అవుతాయి. అయితే ఒకప్పుడు గురు అలియాస్ విష్ణు విశాల్ తండ్రి మొయిద్దీన్ భాయ్ ప్రాణ స్నేహితులు. తన కొడుకు షంషుద్దీన్‌తో పాటు గురును కూడా సొంత కొడుకుగానే చూస్తాడు భాయ్. కానీ మత కల్లోలాలతో ఇద్దరూ దూరం అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు గురు, శంషుద్దీన్‌ల మధ్య గొడవకు అసలు కారణం ఏంటి? అనేదే రిమైనింగ్ స్టోరీ.

ముందు నుంచి చెప్తున్నట్లు లాల్ సలామ్ గొప్ప కథేం కాదు.. ఇదివరకు ఎన్నో సినిమాల్లో చూసిన మామూలు హిందూ ముస్లిమ్ కథే. కాకపోతే దానికి క్రికెట్ నేపథ్యాన్ని కూడా జోడించింది డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్. రెండు మతాలను రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం ఎలా వాడుకున్నారు అనేదాన్ని సినిమాలో ఎక్కువగా చూపించింది ఐశ్వర్య. దానికి ఊరు నేపథ్యం ఇచ్చింది. గ్రామంలో జరిగే జాతర.. అమ్మవారితో లింక్ పెట్టి రూరల్ డ్రామాగా తెరకెక్కించింది. రజనీకాంత్ క్యారెక్టర్‌ను ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా డిజైన్ చేసింది ఐశ్వర్య. ఇంకో విషయం! అందరూ అనుకుంటున్నట్టు ఆయనది ఈ సినిమాలో గెస్ట్ రోల్ కాదు. ఫిల్మ్ మొత్తం ఉండే రోల్. ఆల్మోస్ట్ హీరో రోల్. కానీ రజినీ స్టార్‌ డమ్‌ను ఎందుకో సరిగా వాడలేదు ఈ లేడీ డైరెక్టర్.

ఇక యాక్టింగ్‌ విషయాన్ని వస్తే.. రజినీ.. రజినీయే!.. కానీ డైరెక్టర్‌ ఐశ్వర్యే ఆయన్ను ఎక్కువగా వాడలేకపోయింది. ఇక రజినీ తర్వాత కీ రోల్‌ చేసిన విష్ణు విశాల్, విక్రాంత్ బాగా యాక్ట్ చేశారు. రాజశేఖర్ వైఫ్‌ జీవితకు చాలా కాలం తర్వాత మంచి క్యారెక్టర్‌ పడింది. ఆమె కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్..చిన్న సినిమా అనుకున్నాడో ఏమో కానీ.. మ్యూజిక్‌ అంత ఆకట్టుకునేలా మాత్రం ఇవ్వలేదు. సినిమాటోగ్రాఫర్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఇక ఓవర్‌ ఆల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. సరిగ్గా డీల్ చేసుంటే లాల్ సలామ్ నిజంగానే ఇంకా మంచి సినిమా అయ్యుండేదేమో..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..