Sunny Leone: పనిమనిషి కుమార్తె కోసం సన్నీలియోన్ పెట్టిన పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్.
ముంబయిలో కనిపించకుండాపోయిన తన పనిమనిషి కుమార్తె అనుష్క దొరికిందంటూ నటి సన్నీలియోన్ తెలిపారు. తొమ్మిదేళ్ల వయసున్న ఆ పాపను వెతకడంలో సాయం చేసిన వారికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. తమ ప్రార్థనలకు సమాధానం దొరికిందని ఆ కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ఆమె ట్వీట్ చేసారు. ముంబయి పోలీసులకు థ్యాంక్యూ చెప్పారు. కనిపించకుండాపోయిన 24 గంటల్లోనే అనుష్క తిరిగి తమ వద్దకు చేరిందని ఆమె కోసం తాను పెట్టిన పోస్ట్‌ను షేర్ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
ముంబయిలో కనిపించకుండాపోయిన తన పనిమనిషి కుమార్తె అనుష్క దొరికిందంటూ నటి సన్నీలియోన్ తెలిపారు. తొమ్మిదేళ్ల వయసున్న ఆ పాపను వెతకడంలో సాయం చేసిన వారికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. తమ ప్రార్థనలకు సమాధానం దొరికిందని ఆ కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ఆమె ట్వీట్ చేసారు. ముంబయి పోలీసులకు థ్యాంక్యూ చెప్పారు. కనిపించకుండాపోయిన 24 గంటల్లోనే అనుష్క తిరిగి తమ వద్దకు చేరిందని ఆమె కోసం తాను పెట్టిన పోస్ట్‌ను షేర్ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. అనుష్క మిస్ అయ్యిందంటూ.. వెతకడంలో సాయం చేయాలని కోరుతూ సన్నీ లియోన్ గురువారం ఉదయం ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. జోగేశ్వరి వెస్ట్ బెహ్రామ్ బాగ్‌లో నవంబర్ 8 సాయంత్రం ఆ పాప మిస్ అయ్యిందని.. ఆమెను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.50,000 నగదు బహుమతిగా అందిస్తానని ఆమె రివార్డు ప్రకటించారు. పాప తల్లిదండ్రుల ఆవేదనను చూస్తుంటే తనకెంతో బాధగా ఉందని ఆమె చెప్పారు. ఆమె ముంబయి పోలీస్ విభాగాన్ని కూడా ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఆ పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ క్రమంలో పాప ఆచూకీ దొరికిందని గురువారం రాత్రి మరో పోస్ట్ పెట్టారు. సన్నీ లియోన్ మంచి మనసును నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.