TOP 9 ET News: ఆ న్యూస్ పచ్చి అబద్దం.. RIP చంద్రమోహన్..
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా చూస్తుండగా.. తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పారు మేకర్స్. దివాళికి ప్లాన్ చేసిన ఫస్ట్ సింగిల్ రావట్లేదని తెలిపారు. ఆడియో డిస్టర్బెన్సుల వల్ల వాయిదా వేస్తున్నామని.. కొత్త డేట్ త్వరలోనే చెప్తామని క్లారిటీ ఇచ్చారు గేమ్ ఛేంజర్ టీం.
TOP 9 ET News: వెల్ కమ్ టూ.. టాప్9 ఈటీ.. టుడే నవంబర్ 11th టాప్ 9 ఈటీ ఏంటో.. ఇప్పుడు క్విక్ గా చూసేద్దాం..! సలార్ ట్రైలర్ అప్ డేట్ కోసం చూస్తున్న అభిమానులకు దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు యూనివర్సల్ ట్రైలర్ ఒకటే కట్ చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్‌తోనే ఉంటుందని దాని అర్థం. అయితే అందులో నిజం లేదని.. అలాంటిదేం ప్లాన్ చేయలేదని చెప్పారు ప్రశాంత్ నీల్. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ విడుదల కానుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణవార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సినిమా ఇండస్ట్రీ అంతా నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేరనే వార్త తెలుసుకుని సహ నటులు కన్నీరు పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో హృదయానికి సంబంధించి చికిత్స తీసుకుంటూ కన్నుమూసారు చంద్రమోహన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూపీలో విషాదకర ఘటన !! బైక్‌పై సోదరి మృతదేహంతో సోదరుడు
మత్తు మందు ఇవ్వకుండానే చిన్నారులకు ఆపరేషన్లు
పసుపు ప్రాణాలను హరిస్తుందా ?? వెలుగులోకి షాకింగ్ విషయాలు
టీచర్ రూపంలో కామపిశాచి.. స్టూడెంట్‌కు మద్యం, డ్రగ్స్ ఇచ్చి మరీ..