మత్తు మందు ఇవ్వకుండానే చిన్నారులకు ఆపరేషన్లు

మత్తు మందు ఇవ్వకుండానే చిన్నారులకు ఆపరేషన్లు

Phani CH

|

Updated on: Nov 10, 2023 | 8:50 PM

గాజాలో వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడంతో మత్తుమందు ఇవ్వకుండానే చిన్నారులకు ఆపరేషన్లు చేస్తున్నారు. కనీసం గాయాలు శుభ్రం చేయడానికీ నీరు లేకపోవడంతో గాయాలపాలైనవారు నరకం చూస్తున్నారు. గాజాలో తమ ప్రాణాలు పోతాయని తెలిసినా పాలస్తీనా వైద్యులు, నర్సులు యుద్ధ క్షేత్రంలో సేవలందిస్తున్నారని, వారే నిజమైన హీరోలని అమెరికాకు చెందిన నర్సు ఎమిలీ కల్లాహన్‌ తెలిపారు. గాజాలో మొన్నటివరకూ సేవలందించిన ఆమె..

గాజాలో వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడంతో మత్తుమందు ఇవ్వకుండానే చిన్నారులకు ఆపరేషన్లు చేస్తున్నారు. కనీసం గాయాలు శుభ్రం చేయడానికీ నీరు లేకపోవడంతో గాయాలపాలైనవారు నరకం చూస్తున్నారు. గాజాలో తమ ప్రాణాలు పోతాయని తెలిసినా పాలస్తీనా వైద్యులు, నర్సులు యుద్ధ క్షేత్రంలో సేవలందిస్తున్నారని, వారే నిజమైన హీరోలని అమెరికాకు చెందిన నర్సు ఎమిలీ కల్లాహన్‌ తెలిపారు. గాజాలో మొన్నటివరకూ సేవలందించిన ఆమె.. అక్కడ ఎదురవుతున్న సవాళ్లు, ప్రజల దీనస్థితి గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. దక్షిణ గాజాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఖాన్‌ యూనిస్‌ కేంద్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆమె అన్నారు. దాదాపు 50వేల మంది ఉంటే నాలుగు టాయిలెట్లే ఉన్నాయి. రోజుకు 4 గంటలే నీటి సరఫరా జరుగుతోంది. అసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పిల్లల్ని వెంటనే డిశ్చార్జి చేయాల్సి వస్తోంది. నీరు, ఆహారం కొరత ఏర్పడింది. స్థానిక సిబ్బంది రక్షించకపోతే తాము చనిపోయేవాళ్లమని అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పసుపు ప్రాణాలను హరిస్తుందా ?? వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

టీచర్ రూపంలో కామపిశాచి.. స్టూడెంట్‌కు మద్యం, డ్రగ్స్‌ ఇచ్చి మరీ..

Onion Price: అక్కడ ఉల్లి చాలా చౌక.. కేవలం కిలో రూ.25లకే

భూగోళంపై అరుదైన దృశ్యం.. సూర్యుడి ఉపరితలంపై సౌర తుఫాను

ప్రాణం తీసిన రోబో.. కూరగాయల బాక్స్‌ అనుకొని !!