Amitabh Bachchan - Prabhas Fans: 'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..

Amitabh Bachchan – Prabhas Fans: ‘ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి’.. వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Jun 26, 2024 | 6:33 PM

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రంలో అమితాబ్ కీ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. భారతీయ పురణాలను ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రంలో అమితాబ్ కీ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. భారతీయ పురణాలను ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. కల్కి మూవీ ప్రమోషన్లలో భాగంగా అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణేతోపాటు నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నదత్ వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను, షూటింగ్ ముచ్చట్లు పంచుకున్నారు.

అయితే ఈ మూవీలో ప్రభాస్‏ను అమితాబ్ బచ్చన్ కొట్టే సీన్స్ ఉంటాయని.. సినిమా చూసిన తర్వాత తనపై దాడి చేయొద్దని.. అందుకే ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానని సరదాగా అన్నారు అమితాబ్. దీంతో అందరూ మీ ఫ్యాన్సే అంటూ అమితాబ్ తో అన్నారు ప్రభాస్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు అందర్నీఆకట్టుకుంటోంది. అంతేకాదు ప్రభాస్‌ అండ్ అమితాబ్‌ మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్‌ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.