Loading video

ఎమర్జెన్సీ సినిమా బ్యాన్.. సిక్కుల తీవ్ర ఆందోళనలు

|

Jan 21, 2025 | 6:14 PM

సినీ న‌టి కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ఎమ‌ర్జెన్సీ చిత్రం కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జీవితక‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. అయితే ఆ ఫిల్మ్ రిలీజ్‌ను వ్య‌తిరేకిస్తూ పంజాబ్‌లో సిక్కులు ఆందోళ‌న‌కు దిగారు. అమృత్‌స‌ర్‌లోని ఓ సినిమా హాల్ వ‌ద్ద భారీ సంఖ్య‌లో ఎస్‌జీపీసీ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఎమ‌ర్జెన్సీ చిత్రంపై బ్యాన్ విధించాల‌ని ఎస్జీపీసీ పంజాబ్ స‌ర్కార్‌ను కోరింది.

పంజాబ్‌లోని అన్ని సినిమా హాళ్ల‌లో షోల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరింది. ఇలాంటి సినిమాలు తీసిన‌ప్పుడు, ఆ చిత్రాల్లో వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తార‌ని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ చీఫ్ అమ‌రింద‌ర్ సింగ్ రాజా ధ్వజమెత్తారు. మ‌సాలా లేకుండా సినిమా స‌క్సెస్ కాద‌న్నారు. ప్ర‌జ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ఇలాంటి సినిమాలు తీయ‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌భుత్వాలు, సెన్సార్ బోర్డులు .. ఇలాంటి చిత్రాల‌పై నిఘా పెట్టాల‌న్నారు. చిత్రంలో చూపించింది నిజం కాదు అని, అది కేవ‌లం ఓ స్క్రిప్టు మాత్ర‌మే అని ఆయ‌న పేర్కొన్నారు. భారతదేశ తొలి మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జీవిత కథతో రూపొందించిన హిందీ చిత్రం ‘ఎమర్జెన్సీ’. కాంగ్రెస్‌ హయాంలో ఏర్పడిన ఈ అత్యవసర పరిస్థితి.. నేటికి కూడా ఆ పార్టీ ప్రత్యర్థులకు ఒక అస్త్రంగానే ఉపయోగపడుతోంది. బీజేపీ ఎంపీ అయిన నటి కంగనా రనౌత్ స్వయంగా ఇందిరాగాంధీ పాత్రలో నటించి, దర్శకత్వం హహించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవును.. సైఫ్‌పై దాడి చేసింది నేనే.. అంగీకరించిన నిందితుడు

Balakrishna: అదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయను..

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు

TOP 9 ET News: వెంకీతో రూ. 50 కోట్లే కష్టం అన్నారు కానీ కట్ చేస్తే…| బుల్లి రాజుకు కష్టాలు

రోగం కాదు.. ఓవర్ యాక్షన్.. పబ్లిసిటీ కోసమే కదా.. ఈ కథలు!

 

Published on: Jan 21, 2025 06:13 PM