Samantha Diagnosis Exclusive video: తన వ్యాధిపై ఆందోళన..కన్నీటి సంద్రమైన సమంత.. ఇప్పటికింకా చావలేదు అంటూ.. వీడియో.

Samantha Diagnosis Exclusive video: తన వ్యాధిపై ఆందోళన..కన్నీటి సంద్రమైన సమంత.. ఇప్పటికింకా చావలేదు అంటూ.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 08, 2022 | 10:57 AM

గత కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. చేతికి సెలైన్ పెట్టుకుని డబ్బింగ్ చెబుతున్న ఫోటో షేర్ చేస్తూ.. తనకున్న వ్యాధి గురించి చెప్పుకొచ్చింది.



మయోసైటిస్‌ అనారోగ్యంపై సమంత భావోద్వేగానికి గురయ్యింది. యశోద ప్రమోషన్స్ కోసం జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంది. ఇప్పటికింకా నేను చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు. సామ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని, గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి తోడు ఆమె కొంతకాలంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయిన నేపథ్యంలో సామ్‌ స్పందించింది. తాను ‘మయోసైటిస్‌’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. ‘యశోద’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాను పూర్తి చేసేందుకు సామ్‌ శాయశక్తులా ప్రయత్నించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

 

Published on: Nov 08, 2022 09:57 AM