Saipallavi: సొంత గూటికి చేరుకుంటున్న సాయిపల్లవి
సౌత్‌లో సాయిపల్లవి పేరు మళ్లీ మార్మోగుతోంది. ఉత్తరాదిలో వరుస బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న పల్లవి, ఇప్పుడు సౌత్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్ వంటి అగ్ర తారలతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతోంది. 'అమరన్', 'తండేల్' వంటి సినిమాలతో తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చి, 'లేడీ పవర్‌స్టార్'గా అభిమానుల మనసులను గెలుచుకున్న సాయిపల్లవి, త్వరలో 'మేరే రహో', 'రామాయణ్' వంటి హిందీ చిత్రాలతో అలరించనుంది.
సాయిపల్లవి పేరు మళ్లీ వినిపిస్తోంది సౌత్ ఇండస్ట్రీలో. నార్త్ లో వరుసగా మూడు ఏళ్ల పాటు రిలీజులున్నాయి సాయిపల్లవికి. ఇక కంప్లీట్‌గా అక్కడే సెటిల్ అవుతారేమోనని అందరూ అనుకుంటున్న టైమ్‌లో, సౌత్‌లో మరో సినిమాకు సైన్ చేస్తున్నారనే విషయం స్ప్రెడ్ అవుతోంది. ఇంతకీ ఏంటా బజ్? సాయిపల్లవిని అమరన్‌లో చూశాక, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అందరూ యునానిమస్‌గా చెప్పేశారు. ఆ మూవీ ఇచ్చిన ఆనందంతో నార్త్ లో చలరేగి పోతున్నారు పల్లవి. మన దగ్గర తండేల్‌కి కూడా చాలా మంచి పేరు వచ్చింది లేడీ పవర్‌స్టార్‌కి. సాయిపల్లవి ఫస్ట్ హిందీ వెంచర్ మేరే రహో ఈపాటికే రిలీజ్ కావాల్సింది. కానీ, కాస్త వాయిదా పడి వచ్చే నెల్లో విడుదలవుతోంది. ఈ మూవీ తర్వాత నెక్స్ట్ ఇయర్ రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ పార్ట్ 2 ప్రిపేర్ అవుతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా నార్త్ ముచ్చట. మరి సౌత్ సంగతేంటి అంటే.. ఏకంగా సూపర్‌స్టార్ సినిమాకు సైన్ చేశారు సాయిపల్లవి అనేది న్యూస్. కమల్‌హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటిస్తున్న సినిమా కోసం సాయిపల్లవిని అప్రోచ్ అయ్యారట మేకర్స్. రౌడీ బేబీ ఓకే చెప్పినట్టు కూడా వార్తలున్నాయి. అన్నట్టు ధనుష్ తోనూ మరో సినిమాకు పల్లవి సైన్ చేశారన్నది వార్త.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర
దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??
ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్ మిస్ అవుతుంది జాగ్రత్త !!
Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. స్కిన్ క్రీమ్ రూపంలో ఇన్సులిన్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

