అప్పుడు కల్కి బుజ్జి.. ఇప్పుడు అఖండ రాక్స్
తెలుగు సినిమాలు యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక వాహనాల డిజైన్‌లపై దృష్టి సారిస్తున్నాయి. కల్కిలోని బుజ్జి కారు, సలార్ బైక్, అఖండ 2లోని జెనెక్స్ వంటివి దీనికి ఉదాహరణలు. దర్శకులు నాగ్ అశ్విన్, బోయపాటి శ్రీను ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులోనూ సినీ వాహనాల డిజైన్‌లకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది, ఇది సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది.
సినిమా ఏమాత్రం స్పెషల్‌గా కనిపించాలన్నా ఆ సినిమాలో ప్రతి విషయంలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండాలి. ఎక్కడో జనాలకు నచ్చే విషయాలను ఇంక్లూడ్ చేస్తుండాలి. యూత్‌కి నచ్చే అలాంటి అంశాల గురించి ప్రస్తావిస్తే ముందు గుర్తుకొచ్చేవి యాక్ససరీస్ అండ్ మోటార్ వెహికల్స్. రీసెంట్‌గా వీటి మీద తెలుగు సినిమాల్లో కాసింత ఎక్కువ కృషి జరుగుతోంది. ఇంతకీ ఏంటది? కల్కి సినిమా చూసిన వారికి బుజ్జి గురించి, అదే నండీ.. సినిమాలో వాడిన కారు గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఈ సినిమా కోసం స్పెషల్‌గా డిజైన్ చేయించారు నాగ్ అశ్విన్. కొందరు సెలబ్రిటీలు కూడా బుజ్జిని డ్రైవ్ చేసి సూపర్ ఎక్స్ పీరియన్స్ అన్నారు. ప్రభాస్ కల్కిలోనే కాదు, సలార్‌లోనూ స్పెషల్ బైక్‌ని వాడారు. మామూలు బైక్ అయినా, ఈ మూవీ కోసం కస్టమైజ్ చేశారన్నది అప్పట్లో బాగా వినిపించిన టాక్. సలార్ బైక్ మోడిఫైడ్ అంటూ అప్పట్లో మూవీ యూనిట్ కూడా ఇష్టంగా ప్రేక్షకులతో ఆ విషయాన్ని పంచుకుంది. లెజెండ్ సినిమా చూసిన వారికి బాలయ్య వాడిన బైక్, కారు స్పెషల్‌గా గుర్తుకొస్తాయి. అప్పుడు ఆ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకున్న బోయపాటి శ్రీను, లేటెస్ట్ గా అఖండ 2 కోసం రాక్స్ ని డిజైన్ చేయించారు. జెనెక్స్ పేరుతో ఈ వెహికల్‌ని స్పెషల్‌గా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల్లో, మరీ ముఖ్యంగా వారణాసిలో ఈ తరహా స్పెషల్ వెహికల్స్ ఏమైనా ఉండే అవకాశాలున్నాయా? అనే టాక్స్ డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. కల్కి సీక్వెల్‌లో కొత్త రకం వెహికల్స్ ఇంకేం ఉండొచ్చనే మాటలూ మొదలయ్యాయి. సో, నియర్ ఫ్యూచర్‌లో కొత్త సినిమా అంటే కాంబినేషన్లు, ఆర్టిస్టుల లుక్స్ తో పాటు వెహికల్స్ డిజైన్స్ మీద కూడా మన వాళ్లు మరింత శ్రద్ధ తీసుకోబోతున్నారనే విషయమైతే ఇప్పుడు స్పష్టమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర
దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??
ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్ మిస్ అవుతుంది జాగ్రత్త !!
Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. స్కిన్ క్రీమ్ రూపంలో ఇన్సులిన్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

