Drishyam 3: ట్రెండింగ్‌లోకి వచ్చేసిన దృశ్యం-3 హ్యాష్ ట్యాగ్
దృశ్యం 3 పై ఉత్కంఠ కొనసాగుతోంది. మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విడుదలకు ముందే రూ.160 కోట్లకు థియేట్రికల్, డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయి. హిందీ, మలయాళంలో ఏకకాలంలో విడుదల కానుంది. తెలుగులో వెంకటేష్ రీమేక్‌లో నటిస్తారు. ఆయన షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో సస్పెన్స్.
ప్రేక్షకులు ఇష్టంగా ఎదురుచూసే ఫ్రాంఛైజీల్లో దృశ్యం ఎప్పుడూ స్పెషల్ ప్లేస్‌ని దక్కించుకుంటుంది. ఇప్పుడు థర్డ్ చాప్టర్‌ని రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు క్రేజీ అప్‌డేట్ తో ప్రేక్షకులను మెప్పిస్తోందీ మూవీ. ఇంతకీ ఏంటా అప్‌డేట్? మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న సినిమా దృశ్యం3. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూట్‌ని స్టార్ట్ చేస్తామని ఇంతకు ముందే ప్రకటించారు మేకర్స్. కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. త్వరలోనే షూటింగ్ షురూ అవుతుంది. డిసెంబర్ ఎండింగ్ లోపు ముహూర్తం ఫిక్సయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా స్టార్ట్ కాని ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్ రైట్స్ మాత్రం మంచి ధరకు అమ్ముడయ్యాయన్నది మాలీవుడ్ న్యూస్. 160 కోట్లు చెల్లించి పనోరమా స్టూడియోస్ హక్కులను చేజిక్కించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ, మలయాళంలో ఏక సమయంలో మూవీని రిలీజ్ చేయాలనే డిమాండ్‌తో ఈ డీల్ కుదిరిందన్నది టాక్. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబోలో వచ్చిన దృశ్యం రెండు చాప్టర్లకు ప్రేక్షకుల్లో అమితమైన క్రేజ్ ఉంది. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర రూ.240 కోట్లకు పైగా వసూలు చేయడంతో థర్డ్ చాప్టర్‌కి డిమాండ్ పెరిగింది. థర్డ్ చాప్టర్‌ని ఏ లాంగ్వేజ్‌లో ఎవరు చేసినా తెలుగులో మాత్రం వెంకటేష్ చేస్తారని రీసెంట్‌గా స్పష్టం చేశారు నిర్మాత సురేష్‌బాబు. అయితే వెంకీ కూడా మోహన్‌లాల్‌తో పాటు సైమల్‌టైనియస్‌గా తెలుగు వెర్షన్‌ని పూర్తి చేస్తారా? లేకుంటే, అక్కడ మూవీని పూర్తి చేశాక, ఇక్కడ మొదలుపెడతారా అనేది సస్పెన్స్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాస్ సిలిండర్ నుండి పాన్ కార్డ్ వరకు డిసెంబరులో జరిగే మార్పులు ఇవే
భక్తులతో కిక్కిరిసిన శబరిమల..12 రోజుల్లో 10 లక్షలమంది..
రూ. 10 కోట్లకు విల్లా.. హైదరాబాద్‌లో భారీ డిమాండ్
నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్ చేస్తేనే
పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. స్కిన్ క్రీమ్ రూపంలో ఇన్సులిన్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

