Rashmika Mandanna: యానిమల్‌ సినిమా క్యారెక్టర్‌ పై రష్మిక షాకింగ్ కామెంట్స్.. వైరల్.

Updated on: Dec 10, 2023 | 5:55 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద యానిమల్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. వారం రోజుల్లోనే దాదాపు 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రణబీర్‌తో పాటు రష్మిక మందన్న, బాబీ డియోల్, అనిల్ కపూర్, ట్రిప్తి డిమ్రీ కీలక పాత్రలు పోషించారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద యానిమల్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. వారం రోజుల్లోనే దాదాపు 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రణబీర్‌తో పాటు రష్మిక మందన్న, బాబీ డియోల్, అనిల్ కపూర్, ట్రిప్తి డిమ్రీ కీలక పాత్రలు పోషించారు. ఇందులో రణబీర్, రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో గీతాంజలి పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా హీరోయిన్ గా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా.. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది రష్మిక.

యానిమల్ బీటీఎస్ చిత్రాలను షేర్ చేస్తూ గీతాంజలి గురించి చెప్పుకొచ్చింది. “గీతాంజలి గురించి ఒక్క మాటలో చెప్పాలాంటే.. ఆమె కుటుంబాన్ని ఒకచోట చేర్చే ఏకైక శక్తి ఇంట్లో ఉంటుంది. ఆమె స్వచ్ఛమైనది, ఆమె ప్రేమ నిజమైనది, బలమైనది.. దృఢమైనది.. కొన్ని సమయాల్లో నటిగా, నేను గీతాంజలి చేసే కొన్ని పనులను ప్రశ్నిస్తాను. అలాగే నా దర్శకుడు నాకు చెప్పింది ఇంకా నాకు గుర్తుంది. ఇది రణవిజయ్ , గీతాంజలి కథ. వారి ప్రేమ, అభిరుచి, వారి కుటుంబాలు, వారి జీవితాలు. ఇదే రణవిజయ్.. గీతాంజలి అంటే. అన్ని హింసలు, బాధలు, భరించలేని బాధలతో నిండిన ప్రపంచంలో.. గీతాంజలి శాంతి నమ్మకాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. ఆమె తన భర్త, తన పిల్లలను సురక్షితంగా ఉంచమని దేవుళ్ళను ప్రార్థిస్తుంది. అన్ని తుఫానులను ఎదుర్కొన్న శిల తను. తన కుటుంబం కోసం ఏదైనా చేస్తుంది. గీతాంజలి నా దృష్టిలో చాలా అందమైన అమ్మాయి. చాలా మంది మహిళల మాదిరిగానే తను కూడా తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. యానిమల్ సినిమా వారం రోజులుగా విజయవంతగా కొనసాగుతుంది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. మీ ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తుంది. అలాగే ప్రతి సినిమాను మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మీ అందరికి బిగ్ హగ్స్” అంటూ ముగించింది రష్మిక. ప్రస్తుతం ఆమె ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.