Skanda: ఓటీటీలో దూసుకుపోతున్న స్కంద.! రికార్డ్ స్థాయిలో వ్యూస్..

Skanda: ఓటీటీలో దూసుకుపోతున్న స్కంద.! రికార్డ్ స్థాయిలో వ్యూస్..

Anil kumar poka

|

Updated on: Nov 05, 2023 | 9:45 AM

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలో ఓటీటీలో సందడి చేయడం కామనే .. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీకి వచ్చేస్తుంటే.. మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చాలా సినిమాలు ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ ను రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలో ఓటీటీలో సందడి చేయడం కామనే .. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీకి వచ్చేస్తుంటే.. మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చాలా సినిమాలు ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ ను రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అఖండ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి చేసిన సినిమా కావడంతో స్కంద మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లోకి వెళ్లాయి. కానీ థియటర్స్ కు వచ్చేసరికి ఆ అంచనాలను అందుకోలేక పోయింది స్కంద. రామ్ పోతినేని మాస్ అవతార్ లో కనిపించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అలాగే రామ్ డ్యూయల్ రోల్ లో కనిపించాడు ఈ సినిమాలో.. అయితే ఈ మూవీ పై ట్రోల్స్ కూడా భారీగా వచ్చాయి. సినిమాలో కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉండటంతో ఈ మూవీ పై ట్రోల్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. సినిమా కు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం పర్లేదు అనిపించుకున్నాయి. ప్రస్తుతం స్కంద సినిమా డిస్ని హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో సినిమా చూడని వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా చూడటాన్ని ఎగబడుతున్నారు. కొత్త సినిమా పైగా ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చూసే ఛాన్స్ కావడంతో జనాలు స్కంద సినిమాను తెగ చూస్తున్నారు. దాంతో ఈ మూవీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటుంది ఈ మాస్ మాసాల మూవీ. థియేటర్ లో దెబ్బేసిన ఓటీటీలో ఇలా ట్రెండ్ అవ్వడంతో ఫ్యాన్స్ కాస్త ఖుష్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.