బాధపడాల్సిన పనిలేదు.. కృష్ణ ఫ్యాన్స్‌ను వెరైటీగా ఓదార్చిన ఆర్జీవీ

|

Nov 16, 2022 | 8:58 AM

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. మాటలకందని మహా విషాదాన్ని జీర్ణించుకోలేకపోతోంది సినీ లోకం.

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. మాటలకందని మహా విషాదాన్ని జీర్ణించుకోలేకపోతోంది సినీ లోకం. సినీ, రాజకీయ జీవితంలో సూపర్‌స్టార్‌ పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. కృష్ణ మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక తమ దేవుడు లేడంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మా ఘట్టమనేని ఎక్కడా అంటూ రోదిస్తున్నారు. నానక్‌రామ్‌గూడలోని నివాసంలో కృష్ణ పార్థివదేహం ఉంచారు. ప్రముఖులంతా కదిలి వచ్చి నటశేఖరుడికి నివాళి అర్పించారు. పలువురు నటీనటులు, టెక్నీషియన్లు సోషల్ మీడియాలో కృష్ణ గారితో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. కాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కృష్ణ మృతిపై ట్విట్టర్‌లో స్పందించారు. ఆయన కృష్ణ ఫ్యాన్స్‌ను తనదైన రీతిలో ఓదార్చారు. ‘కృష్ణ గారు ఇకలేరని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వారిద్దరు అక్కడ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఆనందకరమైన సమయాన్ని గుడుపుతుంటారని భావిస్తున్నా’ అని ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Super Star Krishna: కృష్ణ సరసన ఎంతమంది హీరోయిన్ల నటించారో తెలుసా ??

ఆంధ్ర ఉద్యమానికి ఉపిరి పోసిన సూపర్‌స్టార్ క‌ృష్ణ

Mahesh Babu: నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమైపోతున్నారు.. వైరల్ అవుతున్న మహేష్ వీడియో

ఘనంగా ట్రంప్‌ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??

వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!

 

Published on: Nov 16, 2022 08:58 AM