హాలీవుడ్‌ మూవీస్‌ను వెనక్కి నెట్టేసిన ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డ్..

|

Jul 05, 2022 | 7:42 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. అంతేకాకుండా విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. డిజిటల్ ప్లాట్ ఫాంపై కూడా ఆర్ఆర్ఆర్ క్రేజ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్ మరో సెన్సేషన్ రికార్డ్ సృష్టించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సీజన్స్ అవార్డ్స్ 2022లో మొదటి భారతీయ చిత్రంగా నామినేట్ అయ్యింది. ఈ అవార్డులలో హాలీవుడ్ చిత్రాలను వెనక్కు నెట్టి మరీ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది ట్రిపులార్‌. పాన్ ఇండియన్ చలనచిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా రన్నరప్‌గా నిలిచింది. మొదటి స్థానంలో ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ నిలిచింది. జూలై 1న హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డులను ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది కదా మానవత్వం అంటే..! విద్యుత్‌ఘాతానికి గురైన ఆవును భలే రక్షించాడు

పెళ్లిలో పురోహితుడు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సరిచ్చిన వరుడు

ఇంత పెద్ద తామర ఆకును ఎప్పుడూ చూసి ఉండరు

తాజ్‌మహల్‌ గదుల్లో దేవతా విగ్రహాలు.. పురావస్తు శాఖ క్లారిటీ..

ఈ కోడి మామూలుది కాదురోయ్‌..యాక్టింగ్‌లో ఆస్కార్‌ పక్కా..

 

Published on: Jul 05, 2022 07:42 PM