ఎయిర్‌పోర్టు ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయిన నటి
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే కు కొత్త కష్టం వచ్చిపడింది. తాజాగా ఇండిగో ఫ్లైట్‌లో భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఏకంగా గంటల తరబడి ఏరోబ్రిడ్జిపై ఎదురుచూడాల్సి వచ్చింది. దాంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. విమానం కోసం గంటల గంటలు ఎదురుచూసిన ప్రయాణికులంతా తీవ్ర అసంతృప్తివ్యక్తం చేశారు. కనీసం అక్కడ వెంటిలేషన్ సరిగా లేకపోవడంతో ప్రయాణికులు అక్కడి సిబ్బందితో గొడవకు దిగారు. ఇక అక్కడ విమానం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల్లో బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే కూడా ఉన్నారు
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తాజాగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండిగో ఫ్లైట్‌లో భువనేశ్వర్ వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయారు. విమానం కోసం గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటిలేషన్ సరిగా లేకపోవడంతో సిబ్బందితో ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఏరోబ్రిడ్జ్‌పై ఇరుక్కుపోయిన ప్రయాణికుల్లో ప్రముఖ నటి రాధికా ఆప్టే కూడా ఉన్నారు. ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు తాను ఫ్లైట్ ఎక్కాల్సి ఉందనీ ప్రస్తుతం 10.50 నిమిషాలు అవుతున్నా ఇంకా విమానం ఎక్కలేదనీ రాసుకొచ్చారు. కానీ తాము ఫ్లైట్ ఎక్కబోతున్నట్లు సిబ్బంది చెబుతున్నారట. ప్రయాణికులు అందరినీ ఏరోబ్రిడ్జి ఎక్కించి లాక్ చేశారు అని రాధికా ఆప్టే తెలిపారు. ప్రయాణికుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని, వీరంతా గంటల తరబడి బందీ అయ్యారని ఆమె తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అబార్షన్‌కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే ??
AI టెక్నాలజీతో అక్కినేనిని మోడర్న్ ఫొటోలు.. నెట్టింట ట్రెండ్
ఇన్ స్టా స్టోరీస్ లో మెగా కోడళ్ల ఆసక్తికర పోస్టులు