AI టెక్నాలజీతో అక్కినేనిని మోడర్న్ ఫొటోలు.. నెట్టింట ట్రెండ్
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఏఐ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు సంక్షిప్త రూపమే ఏఐ. ఏఐలో ఒక శాఖ అనదగ్గ డీప్ ఫేక్ టెక్నాలజీతో అనేక దుష్పరిణామాలు ఉన్నాయని ఇప్పటివరకు అనేక ఉదంతాలు నిరూపించాయి. అయితే, ఇతరుల వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించనంతవరకు ఏఐని ఉపయోగించడంలో తప్పులేదు. ఏఐ టెక్నాలజీని అనేక రూపాల్లో మంచి పనులకు ఉపయోగించవచ్చు.
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఏఐ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు సంక్షిప్త రూపమే ఏఐ. ఏఐలో ఒక శాఖ అనదగ్గ డీప్ ఫేక్ టెక్నాలజీతో అనేక దుష్పరిణామాలు ఉన్నాయని ఇప్పటివరకు అనేక ఉదంతాలు నిరూపించాయి. అయితే, ఇతరుల వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించనంతవరకు ఏఐని ఉపయోగించడంలో తప్పులేదు. ఏఐ టెక్నాలజీని అనేక రూపాల్లో మంచి పనులకు ఉపయోగించవచ్చు. ఇక అసలు విషయానికొస్తే… ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికర స్లైడర్ వీడియో పంచుకున్నారు. ఇందులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావును ఎంతో స్టయిలిష్ గా మోడ్రన్ లుక్ తో చూపించారు. ఇప్పటి హెయిర్ స్టయిల్స్, కండలు, టోన్డ్ ఫేస్, ట్రెండీ దుస్తుల్లో ఉన్న ఏఐ అక్కినేనిని ఈ వీడియోలో చూడొచ్చు. ఆర్టిఫిషియల్ ఏఎన్నార్ ను ఎంతో ఇంటెలిజెంట్ గా క్రియేట్ చేశారని వర్మ ఈ వీడియోపై వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇన్ స్టా స్టోరీస్ లో మెగా కోడళ్ల ఆసక్తికర పోస్టులు
సంతానలేమికి కారు సీటూ కారణం కావొచ్చు.. ఎలాగంటే ??
వందేళ్లుగా భోగి వేడుకలకు దూరంగా ఉంటున్న రెండు గ్రామాలు
Sabarimala: మకరజ్యోతి దర్శనం కోసం కిక్కిరిసిన శబరిమల
శిల్పారామంలో సంక్రాంతి సందడి.. ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్శకులు.