Sabarimala: మకరజ్యోతి దర్శనం కోసం కిక్కిరిసిన శబరిమల

శబరిమలలో అతిపెద్ద వేడుకకు సమయం సమీపిస్తోంది. మకర సంక్రాంతి కోసం యావత్‌ శబరిమల వేచిచూస్తోంది. సంక్రాంతినాడు మకరజ్యోతి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ట్రావెన్ కోర్ దేవస్థానం. ఈ పరిస్థితుల్లో భక్తుల రద్దీ ఎలా ఉందో ఈ దృశ్యాలే చెబుతున్నాయి. అయ్యప్పస్వామి దర్శనానికి 40వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక రేపటి దర్శనానికి 50 వేలమంది భక్తులకు అనుమతి ఇచ్చారు. సంక్రాంతి నాడు దర్శనం ఇచ్చే మకరజ్యోతిని కన్నులారా వీక్షించేందుకు ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు.

Sabarimala: మకరజ్యోతి దర్శనం కోసం కిక్కిరిసిన శబరిమల

|

Updated on: Jan 15, 2024 | 6:19 PM

శబరిమలలో అతిపెద్ద వేడుకకు సమయం సమీపిస్తోంది. మకర సంక్రాంతి కోసం యావత్‌ శబరిమల వేచిచూస్తోంది. సంక్రాంతినాడు మకరజ్యోతి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ట్రావెన్ కోర్ దేవస్థానం. ఈ పరిస్థితుల్లో భక్తుల రద్దీ ఎలా ఉందో ఈ దృశ్యాలే చెబుతున్నాయి. అయ్యప్పస్వామి దర్శనానికి 40వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక రేపటి దర్శనానికి 50 వేలమంది భక్తులకు అనుమతి ఇచ్చారు. సంక్రాంతి నాడు దర్శనం ఇచ్చే మకరజ్యోతిని కన్నులారా వీక్షించేందుకు ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. మాలధారణలో ఉన్న స్వాములతో పాటు సివిల్ భక్తులు కూడా పెరగడంతో ఈసారి అయ్యప్ప దర్శనభాగ్యం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. రెండ్రోజుల నుంచి శబరిమలలో పెరుగుతున్న భక్తులతో ఆలయ ప్రాంగణం, మార్గ మధ్యంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శిల్పారామంలో సంక్రాంతి సందడి.. ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్శకులు.

అయోధ్యకు శ్రీరాముడి అత్తారింటి కానుకలు

మమ్మల్ని బెదిరించే అధికారం ఎవరికీ లేదు

 

Follow us