Puri jaggannadh assistant: పూరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య.. షాక్‌లో ఛార్మీ.! అసలు ఎం జరిగింది..?
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.విషయం తెలుసుకున్న పూరిజగన్నాథ్ టీమ్ దిగ్బంతికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కెమెరా.. యాక్షన్.. కట్ ! మధ్యలోనే వీరి జీవితాలు. షూటింగ్ ఉంటేనే కడుపు నిండడాలు..! సినిమా తప్ప మరేది కాదు… వారి బతుకులో మజిలీలు. ఇన్‌షార్ట్ గా చెప్పాలంటే.. ఇది సినిమా కోసం డైరెక్టర్ వెనుకు పాటుపడే ఏడీల కథలు.!ఎస్ ! డైరెక్టర్ అవ్వాలనే ఆశతో.. అందులో మెలకువలు నేర్చుకోవాలనే తపనతో.. జీతం ఇస్తున్నారా లేదాని పట్టించుకోకుండా… డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు గా చేరుతారు కొందరు యువకులు. ఒళ్లుపై తెలియకుండా.. టైం గీం పట్టించుకోకుండా కష్టపడి మరీ పని చేస్తారు. రేపు పొద్దున్న మనం కూడా డైరెక్టర్లు అవతాం కదాని కలలు కంటూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రమే ఆ కలను నిజం చేసుకుంటారు, మరి కొంత మంది ఆ కలను కలగానే ఉంచేస్తారు. ఇంకొంతమంది మాత్రం ఆ కలకు.. నిజానికి మధ్యలో… బ్రతకడానికి కావాల్సి పైకాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. ఒత్తిడికి లోనవుతూ మధ్యలోనే తమ జీవితాన్నా ముగిస్తారు. అలా తాజాగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కుమార్ కూడా తన జీవితాన్ని ముగించారు. ఆత్మహత్య చేసుకున్నారు.చాలా మందిలాగే.. డైరెక్టర్ కావాలనే ఆశతో.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయికుమార్, స్టార్ డైరెక్టర్ పూరీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. పూరీ చాలా సినిమాలకు ఏడీగా కూడా వర్క్ చేశారు. అయితే అప్పుల బాధో.. లేక ఫ్యామిలీలో తలెత్తిన సమస్యలో.. అదీకాక మరేదో కాని… తాజాగా దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తన ఫ్యామిలీతో పాటు.. పూరీ, ఛార్మీ టీంను కూడా దిగ్భ్రాంతికి గురయ్యేలా చేశారు. ఆవేశంగా తీసుకున్న నిర్ణయంతో అనంతలోకానికేగారు.