AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌ VS రణ్‌వీర్ వార్‌పై సంజయ్‌దత్ రియాక్షన్

ప్రభాస్‌ VS రణ్‌వీర్ వార్‌పై సంజయ్‌దత్ రియాక్షన్

Phani CH
|

Updated on: Jul 12, 2025 | 1:00 PM

Share

ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్! సౌత్‌.. నార్త్‌ అని తేడా లేకుండా కలెక్షన్స్‌ కుమ్మేస్తున్న మన తెలుగు స్టార్. ఇక రణ్‌వీర్ సింగ్!సక్సెస్‌ఫుల్‌గా డిఫరెంట్‌ జానర్ సినిమాలను డెలివరీ చేస్తున్న స్టార్. అయితే ఈ స్టార్ హీరోలిద్దరూ ఒకే టైమ్‌లో బాక్సాఫీస్ దగ్గర ఢీ కొనబోతున్నారు. ఈ నేపథ్యంలో.. వీరిద్దరి మధ్య జరగబోయే వార్ మీద బాలీవుడ్ స్టార్ సంజయ్‌ దత్ రియాక్టయ్యారు.

ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌ రాజాసాబ్‌ సినిమా… రణ్ వీర్ సింగ్‌ దురంధర్ సినిమా ఒకేరోజున విడుదల కావడంపై రియాక్టయ్యాడు సంజయ్ దత్. తన లెటెస్ట్ ఫిల్మ్… కేడీ – ద డెవిల్ సినిమా ప్రమోషన్లో ఉన్న సంజయ్‌ దత్‌ దీనిపై ఆసక్తకర కామెంట్స్ చేశారు. రాజాసాబ్‌ సినిమాలో తాను రెండు డిఫరెంట్ రోల్స్ చేశానని చెప్పిన సంజయ్ దత్‌, రాజాసాబ్‌ , దురంధర్ మూవీలు వేటికవే డిఫరెండ్ సినిమాలన్నారని కామెంట్ చేశారు. నిజానికి.. ఈ రెండు మూవీలు.. ఒకే రోజు రిలీజ్ కాకూడదనే తాను కోరుకుంటున్నానని సంజయ్ అన్నారు. ‘ప్రతీ సినిమాకు సపరెట్ జర్నీ ఉంటుంది. ఏదిఏమైనా.. ఈ రెండు సినిమాలు బాగా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీకి మంచిది’ అన్నారు దత్. ఇక ప్రభాస్‌ రాజాసాబ్‌.. రణ్‌వీర్ సింగ్ దురంధర్‌ మూవీస్ ఒకే రోజు రిలీజ్ కావటం.. ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ రెండు, బిగ్ బడ్జెట్ సినిమాలు కావడంతో.. థియేటర్లు ఎవరికి ఎక్కువ దక్కితే వారికే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు గట్టిగానే థియేటర్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు వేర్వేరు డేట్స్‌లో రిలీజ్ అయితే, అటు.. ప్రేక్షకులూ రెండు వేర్వేరు రోజుల్లో మంచి సినిమాలు ఎంజాయ్ చేస్తారని, అటు.. థియేటర్స్‌ ఓనర్స్ కూడా సేఫ్ గా ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ రెండు సినిమా వేరే వేరే డేట్స్‌ రిలీజ్ అయితే బాలీవుడ్‌కు బెటర్ అనే కామెంట్ వస్తోంది కొంత మంది బీటౌన్ పెద్దల నుంచి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Coolie: కూలీ సినిమాపై లోకి ప్రయోగం !! మరో కబాలి కాదు కదా ??

రూ.1000 కోట్ల హీరోయిన్.. ఆస్తి పాస్తులకు లెక్కే లేదు.. డబ్బుపై విరక్తి కాబోలు.. అందుకే చిన్న కార్‌లో అలా..

అభిషేక్ బచ్చన్ బ్యాడ్ లక్‌ !! కెరీర్‌ను నిలబెట్టే ఛాన్స్‌ మిస్..

ప్రభాస్, షారుఖ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన.. కుర్ర హీరో..

దానిమ్మ, స్ట్రాబెర్రీతో అద్భుత ఆరోగ్యం..!