AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిషేక్ బచ్చన్ బ్యాడ్ లక్‌ !! కెరీర్‌ను నిలబెట్టే ఛాన్స్‌ మిస్..

అభిషేక్ బచ్చన్ బ్యాడ్ లక్‌ !! కెరీర్‌ను నిలబెట్టే ఛాన్స్‌ మిస్..

Phani CH
|

Updated on: Jul 12, 2025 | 12:41 PM

Share

అదృష్ట దేవత ఎప్పుడో కానీ తలుపు తట్టదు. అలా తట్టినప్పుడే టైంకు డోర్ తెరిచి మరీ.. ఆ అదృష్ట దేవత ఇచ్చే ఆఫర్ ను ఒడిసిపట్టుకోవాలి. అలాంటి ఛాన్సే.. ఇటు 96డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌కి అటు అభిషేక్ బచ్చన్ కీ వచ్చింది. అయితే ప్రేమ్‌ కుమార్‌ ఆఫర్ యుటిలైజ్ చేసుకోగా... అభిషేక్ మాత్రం చిక్కుకుండా ఉండిపోయాడు. తన కెరీర్‌ను బాలీవుడ్‌లో నిలబెట్టే సినిమాను అభిషేక్ మిస్ చేసుకున్నాడు.

విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా సీ. ప్రేమ్‌ కుమార్‌ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా 96. తమిళ్లో రిలీజ్ అయిన ఈసినిమా ఇండియన్‌ ఫిల్మ్ హిస్టరీలోనే వన్‌ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ డ్రామాగా అందరి మన్ననలను పొందింది. విజయ్‌ సేతుపతికి ఎక్కడ లేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. కెరీర్ ఎండ్ అయిపోతుందనుకున్న త్రిషకు.. ఇండస్ట్రీలో మరికొన్నాళ్లు కొనసాగేలా మైలేజ్‌ ఇచ్చింది. అయితే అలాంటి ఈ సినిమాను మొదట అభిషేక్ బచ్చన్ హీరోగా హిందీలో తెరకెక్కించాలని అనుకున్నాడట డైరెక్టర్ ప్రేమ్ కుమార్. డైరెక్టర్ ప్రేమ్‌ కుమార్ తండ్రి ఉద్యోగ రిత్యా ఎక్కువగా నార్త్‌లోనే ఉండేవారట. దీంతో తనకి హిందీ సినిమాలపై.. హిందీ లాంగ్వేజ్‌పై గ్రిప్పు దొరికిందట. ఈ క్రమంలోనే తన 96 సినిమాను మొదట హిందీలోనే తెరకెక్కించాలని అనుకున్నాడట ప్రేమ్‌. హీరోగా అభిషేన్‌ బచ్చను అనుకున్నాడట. అనుకోవడమే కాదు తన కాంటాక్ట్‌ కోసం తెగ ట్రై చేశాడట. కానీ అభిషేక్ వరకు చేరుకోలేకపోవడంతో… తన నిర్ణయాన్ని మార్చుకుని… తన ఫ్రెండ్ విజయ్ సేతుపతి ప్రోత్సాహంతో… తమిళ్లో 96 సినిమాను మొదలు పెట్టాడట. అలా ఈ సినిమా తమిళ్లో రిలీజ్‌ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాన్ రొమాంటిక్ డ్రామాగా హిస్టరీకెక్కింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్, షారుఖ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన.. కుర్ర హీరో..

దానిమ్మ, స్ట్రాబెర్రీతో అద్భుత ఆరోగ్యం..!

సెకనుకు రూ.10 లక్షలు.. ప్రైవేట్ జెట్.. ఈ హీరోయిన్ రేంజే వేరు

కుళ్లిపోయి, దారుణ స్థితిలో హీరోయిన్ డెడ్ బాడీ.. పోలీసులకే సవాల్

బిగ్ బాస్‌లోకి నిఖిల్ మాజీ లవర్‌ !! సెలక్షన్స్‌తో గూగ్లీ విసురుతున్న బిగ్ బాస్