Prabhas – Salaar: నో కాంప్రమైజ్.. ఎందుకంటే అక్కడుంది ప్రభాస్ కనుక.. సాలార్ అప్డేట్.
కాంప్రమైజ్! మొదలుపెట్టిన తమ సినిమాను.. దేనికీ కాంప్రమైజ్ కాకుండా ఫినిష్ చేయడాన్నే కొందరు డైరెక్టర్స్ అండ్ మేకర్స్ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆవగింజంత పరిమాణంలో.. వాళ్లు అనుకున్నది అనుకున్నట్టు రాకపోయినా.. ఊరుకునేది లేదంటారు. అవసరమైతే సినిమా రిలీజ్‌నే వాయిదా వేస్తారు కానీ... నో కాంప్రమైజ్ అంటారు. ఇక సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా...తన ఫిల్మ్ సలార్ విషయంలో ఇదే చేశారు. తన మొండి నేచర్‌తో.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ మనసు గెలిచేశారు.
కాంప్రమైజ్! మొదలుపెట్టిన తమ సినిమాను.. దేనికీ కాంప్రమైజ్ కాకుండా ఫినిష్ చేయడాన్నే కొందరు డైరెక్టర్స్ అండ్ మేకర్స్ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆవగింజంత పరిమాణంలో.. వాళ్లు అనుకున్నది అనుకున్నట్టు రాకపోయినా.. ఊరుకునేది లేదంటారు. అవసరమైతే సినిమా రిలీజ్‌నే వాయిదా వేస్తారు కానీ… నో కాంప్రమైజ్ అంటారు. ఇక సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా.. తన ఫిల్మ్ సలార్ విషయంలో ఇదే చేశారు. తన మొండి నేచర్‌తో.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ మనసు గెలిచేశారు. ఎస్ ! కేజీఎఫ్ సినిమాతో.. ఇండియన్ సినిమాస్ ముందు.. పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా ఓవర్ నైట్ ఎస్టాబ్లిష్ అయిన ప్రశాంత్ నీల్.. తన టేకింగ్‌తో.. స్టోరీ టెల్లింగ్‌తో అంతటా హాట్ టాపిక్ అయ్యారు. ఫిల్మ్ మేకింగ్‌లో నయా ఫార్ములాను తీసుకొచ్చారు. ఇక అదే ఫార్ములాతో.. కేజీఎఫ్ 2 సినిమాను కూడా బిగ్ హిట్ గా మార్చి.. ఇండియాన్ టాప్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్‌ను తన వైపే తిరిగి చూసేలా చేసుకున్నారు.
ఇక అలాంటి ఈ స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా మొదలెట్టారు. ఆ సినిమా అనౌన్స్ మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. చిన్న టీజర్‌తోనే… ఊహకందని అంచనాలు అమాంతంగా పెరిగేలా చేశారు. ఈ మూవీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 ఈగర్‌గా వెయిట్ చేసేలా చేసుకున్నారు. కానీ కట్ చేస్తే.. సరిగ్గా… ఇంకో వారంలో సలార్ సినిమా రిలీజ్ అనగా.. ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు ఈడైరెక్టర్. తను ప్రాణం పెట్టి చేసిన తన సినిమాలో గ్రాఫిక్స్ అంత క్వాలిటీగా లేదని.. గ్రహించిన ప్రశాంత్ నీల్.. ఆ సీన్స్‌ను కరెక్ట్ చేసే వరకు సినిమా రిలీజ్ చేసేది లేదని మొండికేశారు. అనుకున్నట్టే.. ఆ సీన్లను .. తన విజన్‌కు తగ్గట్టు తీర్చిదిద్ది మరీ.. కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ 22తో థియేటర్లలోకి వస్తున్నట్టు తాజాగా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడమే కాదు.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌ను.. మరింత మెరుగైన గ్రాఫిక్స్ అండ్ కలర్ వర్క్‌తో.. కొత్తగా రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ … విజువల్ ఇంకాస్త మెరుగ్గా కనిపిస్తుండడంతో ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్ నెవర్ కాంప్రమైజ్ యాటిట్యూడ్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే.. ఆ మాత్రం కేరింగ్ కూడా ఉండాలంటూ.. అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..