Silk Smitha Apple: అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?

Silk Smitha Apple: అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?

Anil kumar poka

|

Updated on: Oct 06, 2024 | 7:09 PM

సిల్క్ స్మిత.. అలనాటి తెలుగు ప్రేక్షకులకు తన అందంతో చెమటలు పట్టించింది. ఏ సినిమాలో సిల్క్ స్మిత ఉంటే.. ఆ చిత్రం సూపర్ హిట్ అయినట్టే. 300కిపైగా చిత్రాల్లో నటించి.. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్టార్ నటీమణి ఈమె. ఎంతో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ నటి.. చనిపోయే చివరి రోజుల్లో చాలా నరకం అనుభవించిందని అంటుంటారు.

సిల్క్ స్మిత.. అలనాటి తెలుగు ప్రేక్షకులకు తన అందంతో చెమటలు పట్టించింది. ఏ సినిమాలో సిల్క్ స్మిత ఉంటే.. ఆ చిత్రం సూపర్ హిట్ అయినట్టే. 300కిపైగా చిత్రాల్లో నటించి.. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్టార్ నటీమణి ఈమె. ఎంతో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ నటి.. చనిపోయే చివరి రోజుల్లో చాలా నరకం అనుభవించిందని అంటుంటారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. ఒక్కో మెట్టు ఎక్కి.. స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత.. అప్పట్లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునేదట. అంతెందుకు ఆనాడు ఈమె సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే ఏకంగా లక్ష రూపాయలకు కొన్నారట. దీన్ని బట్టే చెప్పొచ్చు.. అప్పట్లో ఈమెపై కుర్రాళ్లలో క్రష్ ఎంతలా ఉండేదో. అంతటి గొప్ప నటి.. ప్రేమించిన వ్యక్తి, బంధువుల చేతుల్లో మోసపోయి.. చివరి రోజుల్లో దారుణమైన దయనీయ స్థితిని ఎదుర్కొందంటారు. ఆ వేదనతోనే మరణించిందని చెబుతారు.

1960, డిసెంబర్ 2న దెందులూరులో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మీ. ఈమెకు 15 ఏళ్లకే పెళ్లి జరిగింది. ఇక అత్తింటివారి వేధింపులు భరించలేక.. ఆమె మద్రాసు వెళ్ళిపోయింది. మొదట టచప్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసి.. ‘ఇనయే తేడి’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఆమె నటించిన ‘వండిచక్రం’ అనే తమిళ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. విజయలక్ష్మీ కాస్తా.. సిల్క్ స్మితగా మారింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి లాంటి స్టార్స్ ఉన్న సమయంలో కుర్రాళ్లకు క్రేజీగా మారింది సిల్క్ స్మిత.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.