నవంబర్‌లో థియేటర్లలో సందడి చేసే మూవీస్ ఇవే
చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర అస్సలు ఖాళీ ఉండేలా కనిపించట్లేదు. వరసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అక్టోబర్‌లో.. మరీ ముఖ్యంగా దివాళికి 3 రోజుల గ్యాప్‌లోనే అరడజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇక ఇప్పుడు నవంబర్ వంతు..! అక్కడ కూడా తొలివారంలోనే ఒక్కరోజు గ్యాప్‌లో మూడు క్రేజీ సినిమాలు వస్తున్నాయి. మరి అవేంటి..? అక్టోబర్‌లోనే కాదు.. నవంబర్‌లో కూడా క్రేజీ సినిమాలు పోటీ పడుతూనే ఉన్నాయి.
మొదటి వారం నుంచే ఈ పోటీ కనిపిస్తుంది. దివాళికి వస్తుందనుకున్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా సినిమా వృషభ నవంబర్ 6న డేట్ లాక్ చేసుకుంది. ముందు దివాళికి అనుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఫాంటసీ ప్లస్ డివోషనల్ టచ్ ఉన్న రాజుల కాలం నాటి సినిమా ఇది. ఇందులో విఎఫ్ఎక్స్ కు పెద్ద పీఠ వేశారు. అలాగే సుధీర్ బాబు ప్యాన్ ఇండియన్ సినిమా జటాధర నవంబర్ 7న విడుదల కానుంది. ఇది కూడా సోషియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమానే.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. మిరాయ్, కాంతార తరహాలో సాగే కథ ఇది. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా కూడా నవంబర్ 7నే రానుంది. చిలసౌ, మన్మథుడు 2 తర్వాత రాహుల్ చేస్తున్న సినిమా ఇది. ఎవటూ టచ్ చేయని పాయింట్‌తో ఈ సినిమా వస్తుందంటున్నారు మేకర్స్. గీతా ఆర్ట్స్ కంపౌండ్ నుంచి వస్తుంది గర్ల్ ఫ్రెండ్. అలాగే ప్రీ వెడ్డింగ్ షో అనే మరో చిన్న సినిమా సైతం నవంబర్ 7నే రానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nobel Peace Prize 2025: హక్కుల నేత మరియాకు నోబెల్ పీస్ ప్రైజ్.. పాపం ట్రంప్ అంటున్న ప్రపంచం
దీపావళికి క్యూ కట్టిన సౌత్ సినిమాలు.. బిజీ బిజీగా బాక్సాఫీస్
వైరల్ అవుతున్న మెగాస్టార్ నయా లుక్.. ఫ్యాన్స్‌కు పండగేనా
మాట మార్చిన మహేష్.. గ్లోబల్ మూవీలో మాస్ నెంబర్‌కు రెడీ అవుతున్న సూపర్ స్టార్
అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వేట
ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా
ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

