Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు మరో శుభవార్త. ఓజీ మానియా కొనసాగుతుండగానే, ఆయన తదుపరి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. శివరాత్రి కానుకగా ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. పవన్ కల్యాణ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు మరో శుభవార్త అందింది. ప్రస్తుతం ఓజీ సినిమా విజయోత్సాహంలో ఉన్న పవన్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీకి సంబంధించి తాజా అప్డేట్ సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ఫిబ్రవరిలో శివరాత్రి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ తన పోర్షన్ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయి. ఇది రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కావడంతో, పోస్ట్ ప్రొడక్షన్ కు పెద్దగా సమయం పట్టే అవకాశం లేదు. శివరాత్రి సమయంలో పెద్దగా పోటీ లేకపోవడంతో, ఆ తేదీనే దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళికి క్యూ కట్టిన సౌత్ సినిమాలు.. బిజీ బిజీగా బాక్సాఫీస్
వైరల్ అవుతున్న మెగాస్టార్ నయా లుక్.. ఫ్యాన్స్‌కు పండగేనా
మాట మార్చిన మహేష్.. గ్లోబల్ మూవీలో మాస్ నెంబర్‌కు రెడీ అవుతున్న సూపర్ స్టార్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

