చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో.. వీరిద్దరి ప్రమాణ స్వీకారం ఒకెత్తయితే…చిరు కూర్చున్న దగ్గరికే మోదీ వచ్చి మాట్లాడడం ఇంకో ఎత్తు. ఇదే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే హైలెట్‌గా నిలిచింది. దాంతో పాటే అసలు మోదీ చిరుతో ఏం మాట్లాడారనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొంది. అయితే ఆ క్యూరియాసిటీనే కిల్ చేస్తూ.. తాజాగా మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పారు చిరు. చెప్పడమే కాదు.. మోదీ తనతో మాట్లాడిన మాటలకు అక్షర రూపం ఇస్తూ.. ట్వీట్ చేశారు. ఆయన మాటలు కలకాలం గుర్తుండిపోయే మధుర జ్ఙాపకాలు అంటూ తన ట్వీట్లో ఎమోషనల్‌గా కోట్ చేశారు చిరు. ఎలక్షన్ ఫలితాల తరువాత విజయం సాధించిన తన తమ్ముడు పవన్‌ను మెగా స్టార్ చిరు ఇంటికి పిలిచి మరీ స్వయంగా సత్కరించారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. అయితే ఈ వీడియోనే చూసిన నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారట. అన్నదమ్ముల ఆప్యాయత ప్రేమానురాగాలు చూసి ఎమోషనల్ అయ్యారట. అంతేకాదు కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి పవన్ చిరు మధ్య వున్న ప్రేమానుబంధాలు.. భారత సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించేలా ఉన్నాయాని… అనుకున్నారట. ఇక ఇదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికపై చిరుతో చెప్పారట మోదీ. అయితే మోదీ తనతో చెప్పిన ఈ మాటలనే.. మెగాస్టార్ చిరు తాజాగా ట్వీట్ చేశారు. వేదికపై తమ మధ్య జరిగిన సంభాషన ఇదే అంటూ.. రివీల్ చేశారు. అంతేకాదు తమ అన్నదమ్ముల ప్రేమ గురించి మోదీ మాట్లాడడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిదన్నారు మెగాస్టార్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.